టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సూపర్ సినిమాతో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ బాహుబలి సిరీస్ లలో హీరోయిన్ గా రాణించి పాన్ ఇండియా లెవెల్ క్రేజ్ ను దక్కించుకుంది. అయితే ఈ సినిమా తర్వాత అమ్మడు చాలాకాలం వెండి తెరకు దూరమైంది. ఇక గతేడాది నవీన్ పోలిశెట్టితో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమా కూడా కమర్షియల్ గా మంచి సక్సెస్ అందుకుంది. అయితే స్వీటీ ఇండస్ట్రీకి దూరం అవడానికి కారణం ఆమెకు వింత జబ్బు ఉందని.. అందుకే ఆమె సినిమాలకు దూరమైందంటూ వార్తలు వినిపించాయి.
అయితే ఆమెకు ఉన్నా జబ్బు ఏంటి.. సైజ్ జీరో సినిమా కోసం లావెక్కి తన లుక్ మార్చుకోవడం కోసం మళ్లీ సినిమాలకు దూరం అవడమేనా.. అని సందేహాలు నెటింట మొదలయ్యాయి. అసలు అది జబ్బు ఎలా అవుతుంది అంటూ.. ప్రశ్నలు కూడా సందిస్తున్నారు స్వీటీ ఫ్యాన్స్. ఒక పాత్ర కోసం లావెక్కినప్పుడు.. దాన్ని తగ్గడానికి కాస్త సమయం పడుతుంది. అందుకే అమ్మడు సినిమాలకు దూరంగా ఉంది. దాన్ని జబ్బు అనకూడదు అంటూ ఫైర్ అయ్యారు. అయితే ఆమెకు ఉన్న జబ్బు అది కాదని.. ఆమెకు మరో వింత జబ్బు ఉందంటూ నెటింట ప్రస్తుతం వార్తలు వైరల్ అయ్యాయి. ఇంతకీ ఆ జబ్బు మారేదో కాదు.. అనుష్కకు అతిగా నవ్వే అలవాటు బాగా ఉందని.. ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తులు చెప్తున్నారు. ఎంత పెద్ద సెట్ లో అయినా అక్కడ ఎంత సీరియస్ సీన్ జరుగుతున్నా.. తనకు కామెడీ ఫీలింగ్ వస్తే మాత్రం నవ్వు ఆపుకోలేదట.
అక్కడే పక్కపక్క నవ్వేస్తుందని తెలుస్తుంది. అయితే నవ్వడం కూడా ఒక సమస్యనా.. నువ్వు ఆరోగ్యానికి మంచిదని చెబుతూ ఉంటారు కదా.. అని కొంతమందికి సందేహాలు రావచ్చు. నువ్వు ఆరోగ్యానికి మంచిదే.. కానీ కంట్రోల్ చేయలేనంత నవ్వడం మాత్రం ఎవరికైనా నష్టాన్ని కలిగిస్తుంది. అనుష్క అలా నవ్వడం మొదలు పెడితే దాదాపు పావుగంట వరకు నవ్వును ఆపలేదట. ఒక్కోసారి ఇంకా ఎక్కువ సమయం కూడా తీసుకుంటుందని తన సన్నిహితులు చెబుతున్నారు. ఆమెతో నవ్వడం పోటీ పడితే ఎవరు గెలవలేరని వివరిస్తున్నారు. అయితే ఇలా నవ్వడం అనేది ఒక రోగం అని సూడో బుల్ బార్ ఎఫెక్ట్ అంటే నాడీ వ్యవస్థలో లోపం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయని తెలుస్తుంది. అతిగా నవ్వడం, అతిగా ఏడవడం వ్యాధి యొక్క లక్షణాలని తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో.. అనుష్క ఇంత సీరియస్ చెప్పుతో బాధపడుతుందా అంటూ అంతా షాక్ అవుతున్నారు.