రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ కల్కి 2898 ఏడి కి సంబంధించిన ప్రతి విషయం నెట్టింట క్షణాల్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పాత్రలు ఏ విధంగా ఉండబోతున్నాయని ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో మొదలైంది. ఈ నేపథ్యంలో కమల్ హాసన్ పాత్ర ఎలా ఉండబోతుంది.. ఆయన పాత్ర గురించి ఇతిహాసాల్లో ఏమని ఉందో తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలైంది. ఇంతకీ కమల్ పాత్ర ఏంటి.. దాని గురించి ఆసక్తి విషయాలను ఒకసారి తెలుసుకుందాం. కలి యువకుడి పాత్రలో కమలహాసన్ ఈ సినిమాలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఇక కలి గా కమలహాసన్ లుక్‌ను అభిమానులు కూడా గుర్తుపట్టలేని విధంగా తీర్చిదిద్దారు. ఇందులో లోకనాయకుడు సుప్రీం యష్కిన్ అనే వ్యక్తిగా కనిపించనున్నాడు.
అయితే ఇంతకీ కమల్ హాసన్ ప్లే చేసిన ఈ కలి రోల్ ఎవరిది.. భారత పురాణాల్లో కలి గురించి ఏమని వర్ణించారో ఒకసారి తెలుసుకుందాం. కలిపురాణం ప్రకారం కలిపుట్టుక చాలా విచిత్రంగా ఉంటుంది. ఓ మనిషి రక్త సంబంధాలు, వావి వరసలు మరిచిపోయి మొహంతో కామాం చేసినప్పుడు కలి పుడతాడని పురాణంలో వర్ణించారు. కాగా కల్కి సినిమాలో చూపించినట్టు కలి గెటప్ ముసలివాడిగా.. వికృతంగా కనిపించదు. ఓ కుక్క మొఖంతో పదునైన కోరలతో కనిపిస్తాడని పురాణ గ్రంధంలో వర్ణించారు. ఇక కల్కి 2898 ఏడి లోని ఓ కమాండర్ మానస్ పోస్టర్‌లో ఉన్న కాయిన్ పై ఈ కుక్క ముఖాన్ని మనం చూడొచ్చు. అంటే ప్రశాంతంగా కనిపించే కలి రూపం కోపానికి గురైతే అలా కోరలతో ఘోరమైన కుక్కగా మారుతుందని సీక్రెట్ మెసేజ్ కావచ్చు.
అలాగే ఈ కలి తనలో పేరుకుపోయిన సర్వవ్యసనాలు, లోభి తత్వం కారణంగా ఎప్పుడు దుర్వాసనను వెదజల్లుతూ ఉంటాడని కలి పురాణం వర్ణించింది. అలాగే కలి.. సృష్టికర్త బ్రహ్మ దేవుడికి వారసుడు కూడా అని.. పుడుతూనే ఒక చేతిలో నాలుకను, మరో చేతిలో తన పురుషాంగాన్ని పట్టుకొని కలి ఆడుకుంటూ ఉంటాడని పురాణాల్లో ఉంది. అలాగే దుర్యోధనుడికి మరో జన్మ కలి పురుషుడు అని వర్ణించారు. ఇక విష్ణు పురాణం ప్రకారం అయితే ఒక గంధర్వుడు.. శాపం కారణంగా కలిపురుషుడిగా మారతాడట. మనిషిలో ఉండే కామ, క్రోధ, లోభ, మదమత్సర్యాలు ఎక్కడ కనిపిస్తే అక్కడే కలి ఉంటాడని పురాణాలు వర్ణించాయి. మరి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున కల్కి సినిమాలో ఈ కలి పాత్రను ఎలా చూపించబోతున్నాడో.. పురాణాల్లో టచ్ ఉండేలా సినిమాలో కమల్ హాసన్ పాత్ర ఉందో లేదో అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.