టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియన్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. నటిస్తున్న అన్ని సినిమాలలో ప్రస్తుతం ఆడియన్స్ అంతా మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న మూవీ కల్కి. దీపిక పదుకొనే, దిశా పఠాని హీరోయిన్స్ గా , కమల్ హాసన్, అమితాబచ్చన్ లాంటి ప్రధాన తారాగణం అంతా కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. దీంతో సినిమా పై ప్రేక్షకుల మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు.. సినిమాకు సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా అదే రేంజ్ లో ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు.
ఇక ఎప్పుడెప్పుడు సినిమాకు సంబంధించిన ట్రైలర్ వస్తుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు తాజాగా ఆ సస్పెన్స్‌కు తెరదించుతూ కల్కి రిలీజ్ టైం, డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ఎట్టకేలకు నేడు రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్. ట్రైలర్ 6 గంటలకు సెలెక్టెడ్ థియేటర్స్ లో రిలీజ్ కు ప్లాన్ చేశారు మేకర్స్. అయితే ఆన్లైన్లో ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ అభిమానులు సందేహాలు మొదలయ్యాయి. అదే సమయంలో ఆన్లైన్లో కల్కి ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో మేకర్ దేనిపై స్పందిస్తూ ఫైనల్ గా ఈ వర్షన్‌కు సంబంధించిన అప్డేట్ ని తాజాగా ఇచ్చేశారు.
ప్రభాస్ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌తో ఆన్లైన్లో ఈరోజు సాయంత్రం 6 గంటలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లుగా షేర్ చేశారు. థియేటర్స్ లో ట్రైలర్ చూసేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఉండదు. అయితే ఆన్లైన్లో ట్రైలర్ చూడాలని ఆసక్తి చూపేవారు.. ఈరోజు 7 గంటలకు సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్ చేశారు మేకర్స్. మరి ఈ భారీ సినిమాకి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను పాన్ ఇండియాలో అన్ని భాషల్లో 2d , 3d, ఐమాక్స్ వర్షన్లో రిలీజ్ చేయనున్నారు.