ఆర్య సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు సుకుమార్. ఇక చివరిగా వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ట్ డైరెక్టర్గా దూసుకుపోతున్న ఈయన.. పుష్ప 2తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మొత్తానికి ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు సుకుమార్. ఈ క్రమంలో సుకు డైరెక్షన్‌లో నటించడానికి స్టార్ హీరోస్ అంతా ఆసక్తి చూపుతున్నారు. కానీ సుకుమార్ మాత్రం కొంతమంది సెలెక్టెడ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉండడం విశేషం. దీంతో సుకుమార్ తెరకెక్కించే సినిమాల్లో హీరోలుగా ఉండాలంటే కచ్చితంగా ఈ క్వాలిటీస్ ఉండాలంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.
అవేంటో ఒకసారి చూద్దాం. సుకూ సినిమాలలో నటించాలంటే ఆయన క్యారెక్టర్ కి ఎలాంటి హీరో అయితే సెట్ అవుతాడో.. ఆయన ఎలా చెబితే అలా యాక్టింగ్ చేస్తారో ఆ హీరోలకు మాత్రమే సుకుమార్ అవకాశం ఇస్తాడని తెలుస్తుంది. మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ సాధించడంతో.. తన సినిమాలో నటించిన హీరోలకు కూడా మంచి పేరు వస్తుంది. ఇప్పటివరకు ఆయన చాలా తక్కువ మంది హీరోలతోనే సినిమాలను తెరకెక్కించాడు. అందులో బన్నీతో దాదాపు నాలుగు సినిమాలను తెరకెక్కించాడు. దీని బట్టి సుకూ , బన్నీల బాండింగ్ అర్ధమౌతుంది.
అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో కూడా సినిమాలు చేశాడు సుకుమార్. అయితే ఆయన తెరకెక్కించే సినిమాలలో హీరోలుగా నటించాలని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరో కూడా దర్శకుడు ఎలా చెప్తే అలా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటారు. మన ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా ఆయన డైరెక్షన్‌లో నటించే కెపాసిటీ ఉన్నవారే కావడంతో.. మిగిలిన హీరోలకు కూడా ఆయన అవకాశాలు ఇస్తూ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. చూడాలి సుకుమార్ తర్వాత మన స్టార్ హీరోలలో ఎవరితో సినిమా తెరకెక్కించి సక్సెస్ అందుకుంటాడో.