బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వనున్న అనసూయ.. ఆ యంగ్ హీరోతో కలిసి టీవీ షోలో రంగమ్మత్త..?!

బుల్లితర హాట్ యాంకర్ అనసూయకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ టాప్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. మొదట జబర్దస్త్ కామెడీ షోలో హోస్ట్‌గా వ్యవహరించి భారీ పాపులారిటీ దక్కించుకున్న అన‌సూయ‌ తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకుంది. అయితే తర్వాత సినిమాల్లో అవకాశాలు రావడంతో బుల్లితెరకు దూరమైంది. 2002లో జబర్దస్త్ గుడ్ బై చెప్పిన ఈ అమ్మడు.. తాజాగా మరోసారి బుల్లితెర ఎంట్రీ ఇవ్వ‌నుంది అంటూ తెలుస్తుంది.

ఓ బిగ్గెస్ట్ రియాలిటీ షోతో ఈ హాట్ బ్యూటీ బుల్లితెర ఎంట్రీ ఇవ‌నుందంటూ తెలుస్తుంది. ఈ రియాలిటీ గేమ్ షో.. కిర్రాక్ బాయ్స్, కిలాడి గర్ల్స్ పేరుతో స్టార్ మా లో రియాలిటీ షోగా టెలికాస్ట్ చేయనన్నారు. ఈ షో అనౌన్స్మెంట్ వీడియోను స్టార్ మా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది. ఈ వీడియోలో బిగ్ బాస్ రన్నరప్‌.. అమర్దీప్ హైలెట్గా నిలిచాడు. అమర్ దీప్ ఇటీవ‌ల ఓ సినిమాలో హీరోగా ఛాన్స్ కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ షోలో అమ‌ర్‌తో పాటు విష్ణుప్రియ, శోభా శెట్టి, దీపిక పిల్లి, రీతు చౌదరి, యాదమ్మ రాజు తో పాటు పలువురు టీవీ యాంకర్స్ డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు.

చివరిలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తో పాటు అనసూయ షోలో ఎంట్రీ ఇచ్చారు. అమర్ అండ్ గ్యాంగ్‌తో కలిసి వీరు చిందులు వేశారు. కిరాక్ బాయ్స్‌, కిలాడీ గర్ల్స్ పేరుతో అబ్బాయిలు, అమ్మాయిలు వేరు వేరు టీములుగా ఉంటూ ఫన్నీ గేమ్స్, డ్యాన్సులు, కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకుపోతున్నారని తెలుస్తోంది. ఈ షోకు అనసూయ హోస్ట్గా వ్యవహరించనుందట. శేఖర్ మాస్టర్ జడ్జిగా ఉంటారని తెలుస్తోంది. ఆయనతో పాటు ప్రతివారం షోకు ఓ సెలబ్రిటీ గెస్ట్ గా వచ్చి జడ్జిమెంట్ ఇస్తారని టాక్ నడుస్తోంది. అనసూయ రీఎంట్రీలో మరోసారి బుల్లితెర ప్రేక్షకులకు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో చూడాలి.