హ్యాపీ బర్త్డే బాలయ్య.. తన సినీ కెరీర్ లో బాలయ్య ఏకంగా ఇన్ని సినిమాల్లో పోలీస్ గెటప్ లో నటించాడా.. ఆ మూవీస్ ఏంటంటే..?!

నందమూరి నటసార్వభౌమ తారక రామారావు గురించి ఎన్ని సార్లు చెప్పిన టాలీవుడ్ ప్రేక్షకులకు వినుసంపుగానే ఉంటుంది. తెలుగు సినీ ఇండ‌స్ట్రీకు మూల స్తంభాలుగా నిలిచిన వారిలో నందమూరి తారక రామారావు కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నందమూరి నట‌సింహ బాలకృష్ణ తన తండ్రి చేసిన సినిమాల్లో బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తండ్రీతో కలిసి ఎన్నో సినిమాల్లో నటించిన బాలయ్య.. తర్వాత మంగమ్మగారి మనవడు సినిమాతో సోలో హీరోగా ఇంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడు. అప్పటినుంచి వరుస సినిమాల్లో హీరోగా అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు బాలయ్య.

Balakrishna Not Just a Cop, But.. | cinejosh.com

ఇప్పటికీ సీనియర్ స్టార్ హీరోల అందరిలో టాప్ పొజిషన్ తో దూసుకుపోతున్న బాల‌య్య‌ చివరిగా అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుసగా విజయాలను అందుకొంటూ హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక నేడు బాలయ్య పుట్టినరోజు వేడుకలు గ్రాండ్ లెవెల్ లో జరుపుకుంటున్నారు అభిమానులు. సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య తన సినీ కెరీర్ లో పోలీస్ పాత్రలో ఎన్ని సినిమాల్లో నటించాడో.. ఆ సినిమాల లిస్టు ఏంటో ఒకసారి చూద్దాం. బాలకృష్ణ ఇప్పుడు వరకు 108 సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.

Anil Ravipudi Drops A Hint On 'Bhagavanth Kesari' Sequel

అలా తన సినీ కెరీర్ లో ఆయ‌న పోలీస్ ఆఫీసర్‌గా ఏకంగా 12 సినిమాల‌లో నటించాడు. అవేంటంటే ఇన్స్పెక్టర్ ప్రతాప్, తిరుగుబడ్డ తెలుగు బిడ్డ, రౌడీ ఇన్స్పెక్టర్, సీమ సింహం, లక్ష్మీనరసింహ, అల్లరి పిడుగు, చెన్నకేశవరెడ్డి, సుల్తాన్, మాతో పెట్టుకోకు, అశ్వమేధం, రూలర్ సినిమాలతో పాటు బాల‌య్య నుంచి చివరిగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న భగవంత్‌ కేసరి సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించి మెప్పించాడు. ఇలా ఇప్పటివరకు ఆయన 109 సినిమాల్లో 12 సినిమాల్లో పోలీస్ యూనిఫార్మ్‌తో నటించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు.