ద్యావుడా..పుష్ప 2 కోసం రష్మిక కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న తృప్తి..ఎన్ని కోట్లంటే..?

ఎప్పుడు వచ్చామా అన్నది కాదు.. బుల్లెట్ దిగిందా..? లేదా..? ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుంది . ఎస్ మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాలోని డైలాగ్ . ఇంత మంచి డైలాగ్ను మనం మర్చిపోతామా..? ఎన్నిసార్లు విన్నా సరే తనవి తీరదు.. కచ్చితంగా మన లైఫ్ లో ఒకసారి ఈ డైలాగ్ వాడాల్సిందే. రీసెంట్ గా ఈ డైలాగ్ నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. దానికి కారణం తృప్తి దిమ్రి. ఇండస్ట్రీలోకి ఎప్పుడు వచ్చామా అన్నది కాదు రెమ్యూనరేషన్ తీసుకున్నామా లేదా ..? జనాలను ఎంటర్టైన్ చేశామా లేదా..? అన్నదే మెయిన్ పాయింట్ అంటూ ఓ రేంజ్ లో దూసుకుపోతుంది .

యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన తృప్తి ..ఇప్పుడు పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది అన్న వార్త పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతుంది . అనిమల్ సినిమాల్లో న్యూడ్ క్యారెక్టర్ లో ఎలాంటి బోల్డ్ సీన్స్ లో నటించిందో మనకు తెలిసిందే . కాగా పుష్ప2 సినిమాలో ఐటెం సాంగ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు పుష్ప2 సినిమా కోసం రష్మిక మందన్నా..ఛార్జ్ చేసే రమ్యునరేషన్ లో సగానికి పైగాని తృప్తి ఒక్క పాట కోసం ఛార్జ్ చేస్తుందట.

పుష్ప 2 కోసం రష్మిక మందన్నా 6 కోట్లు ఛార్జ్ చేస్తుందట . అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించడానికి తృప్తి ఏకంగా నాలుగు కోట్లు ఛార్జ్ చేసిందట . సినిమా మొత్తం హీరోయిన్గా నటించిన రష్మికకు కేవలం 6 కోట్లు మాత్రమే ఇస్తున్నారు ..ఒక్క పాటలో నటించేందుకు తృప్తి ఏకంగా నాలుగు కోట్లు ఇవ్వడానికి రెడీ అయ్యారు అంటేనే తృప్తి ఏ లెవెల్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు అభిమానులు..!!