అయ్య బాబోయ్..ఆఖరికి బన్నీ కూడా ఆమెను వదిలేశాడా..? పో ఇక కెరీర్ మటాష్..!

సోషల్ మీడియాలో జనాలు పట్టించుకోని హీరోయిన్స్ ని డైరెక్టర్ లు అస్సలు పట్టించుకోరు .. అది అందరికీ తెలిసిన సత్యం.. వాస్తవం . కాగా ఇప్పుడు శ్రీ లీల అదే పొజిషన్లో ఉంది . నిన్న మొన్నటి వరకు ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీ అదృష్ట దేవత ..ఫ్లాప్ హీరోలు ఆమెతో జతకడితే హిట్టు కొట్టేస్తారు ..కోట్లకి కోట్లు లాభాలు వచ్చి చేరుతాయి ..ఇదే స్టాటజీని బాగా ఫాలో అయ్యారు మేకర్స్ . ఎప్పుడైతే ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అవడం మొదలుపెట్టాయో ఆమె బ్రతుకు బస్టాండ్ అయింది .

ఇప్పుడు తెలుగులో కొత్తగా శ్రీలీల సినిమాకి కమిట్ అయిన మూవీస్ నే లేవు. గతంలో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కే సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా సెలెక్ట్ అయింది అంటూ వార్తలు వినిపించాయి . వీళ్లిద్దరూ కలిసి ఒక యాడ్లో కూడా నటించారు . అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం బన్నీ – శ్రీలీలను ఈ సినిమా నుంచి తప్పించాలి అంటూ డిసైడ్ అయ్యారట . క్రేజ్ లేని హీరోయిన్ మనకు అనవసరం అని ..

ఒక్క ముక్కతో తేల్చేసాడట . దీంతో శ్రీలీల ఖాతా నుంచి మంచి అవకాశం మిస్ అయిపోయినట్లు అయింది. ఇక శ్రీ లీల కెరియర్ మటాష్ అని చెప్పడంలో సందేహమే లేదంటున్నారు అభిమానులు. దీంతో ఈ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. అయితే శ్రీలీల ఫ్యాన్స్ వర్షన్ మాత్రం వేరేలా ఉంది. ఈ సినిమా పోతే ఏం ..కోలీవుడ్ లో మూడు సినిమాలు రెడీ గా ఉన్నాయి గా అంటున్నారు అభిమానులు..!!