ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ..జాన్వి కపూర్ పై గుర్రుగా ఉన్నారా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది. దానికి కారణం పుష్ప2.. తెలిసి చేసిందో తెలియక చేసిందో తెలియదు కానీ.. తెలిసి తెలియక జాన్వి కపూర్ చేసిన పని మాత్రం ఇప్పుడు ఓ రేంజ్ లో అమ్మడిని ట్రోలింగ్ కి గురైయ్యేలా చేసింది. జాన్వీ కపూర్ చేసిన పని ఇప్పుడు ఆమె కెరియర్ని డిజాస్టర్ గా మార్చే క్రమంలో ఉండిపోతేలా చేసింది అంటున్నారు జనాలు .
జాన్వికపూర్ ..తెలుగులో ఎన్టీఆర్ సినిమా ద్వారా డెబ్యూ ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాకు దేవర అంటూ నామకరణం చేశారు . ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమానే ఈ దేవర. అయితే ఈ దేవర సినిమా నుంచి లేటెస్ట్ గా ఫియర్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా చిత్రబృందం ఫియర్ సాంగ్ రిలీజ్ చేసింది .
ఈ సాంగ్ ని అస్సలు పట్టించుకోకుండా జాన్వి కపూర్ పుష్ప 2 సాంగ్ లైక్ చేస్తూ లైక్ కొట్టింది . అంతే దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమెపై గుర్రుగా ఉన్నారు. మీ సినిమాలు కాదని పుష్ప2 సినిమాను లైక్ చేస్తావా..? పుష్ప2ని లైక్ చేయి తప్పులేదు ..మరి నీ సినిమా పాట గురించి నువ్వు ప్రమోట్ చేసుకోవా..? అంటూ మండిపడుతున్నారు . ఇది ఎన్టీఆర్కి ఘోర అవమానం అంటూ జాన్వికపూర్ ని బూతులు తిడుతున్నారు..!!