సిల్లీ రీజ‌న్‌తో ” పుష్ఫా 2 ” లో ఛాన్స్ రిజ‌క్ట్ చేసిన‌ బుల్లితెర హీరో.. ఫైర్ అవుతున్న బ‌న్నీ ఫ్యాన్స్‌..?!

బుల్లితెర నటుడు రవికృష్ణ కు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో సీరియల్స్ లో హీరోగా నటించిన రవికృష్ణ.. తెలుగు బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా పాల్గొని సందడి చేశాడు. బిగ్బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత రవి కృష్ణ క్రేజ్ మరింతగా పెరిగింది అనడంలో సందేహం లేదు. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన రవికృష్ణ పలు సీరియల్స్ తో పాటు సినిమాల్లోనూ అవ‌కాశాలు అందుకుంటూ న‌ట‌న‌తో మెప్పిస్తున్నాడు. అయితే చివ‌రిగా విరూపాక్ష సినిమాలో రవి కృష్ణ ప‌వ‌ర్ ఫుల్‌ రోల్ లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అతను మాంత్రికుడుగా కనిపించి ఆకట్టుకుంటాడు.

Ravi krishna (@ravikrishna_official) • Instagram photos and videos

ఆ సినిమా తర్వాత అతనికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఏ క్రమంలో లవ్ మీ సినిమాలో ఒకీలక పాత్ర పోషించాడు. దిల్ రాజు కొడుకు అసిష్ హీరోగా, వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటించిన‌ ఈ సినిమా.. మే 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా ప్లాన్‌ చేశారు మేక‌ర్స్‌. ఇందులో రవి కృష్ణ మాట్లాడుతూ.. ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని షేర్ చేసుకున్నాడు. లవ్ మీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. నేను లవ్ మీ షూటింగ్లో బిజీగా ఉన్న టైంలో పుష్పా 2లో నటించే ఛాన్స్ వచ్చిందని.. కానీ డేట్స్ కుదరకపోవడంతో సినిమాను మిస్సయ్యానంటూ చెప్పుకొచ్చాడు.

Ravi Krishna Speech About Pushpa 2 At Love Me If You Dare Pre Release ||  Allu Arjun || Bullet Raj

అంత పెద్ద సినిమా మిస్ అయినప్పటికీ నేను దాన్ని మైలురాయిగా ఫీల్ అవుతున్నానని.. నాపై నమ్మకంతో అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన పుష్ప 2 మేకర్స్ కు చాలా థాంక్స్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే రవి కృష్ణ చేసిన కామెంట్స్ నెటింట‌ వైరల్ అవ్వడంతో చిన్న సినిమా డేట్స్ అడ్జస్ట్ చేయలేక.. పుష్పా లాంటి పాన్ ఇండియన్ సినిమా లో ఛాన్స్ ను రిజెక్ట్ చేసావా అంటూ.. ఇలాంటి ఛాన్స్ మళ్లీ నీ లైఫ్ లో వస్తుంది అనుకుంటున్నావా అంటూ.. ఇంత సిల్లీ రీజ‌న్ తో పాన్ ఇండియన్ మూవీ ని ఎలా రిజెక్ట్ చేసావ్ అంటూ ఫైర్ అవుతున్నారు బన్నీ ఫ్యాన్స్.