అయ్యయో ..పాపం తారక్..తన కోరిక ఈ విధంగా అయినా తీర్చుకుంటాడో లేడో..?

ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే తారక్ ఇంకా తన కోరిక తీర్చుకోలేదా..? అంటే అవును అన్న సమాధానామే వినిపిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రెసెంట్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్నాడు. పార్లర్గా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వార్ 2 సినిమాని కూడా సెట్స్ పై కి తీసుకొచ్చాడు . రీసెంట్ గానే తన 41వ పుట్టినరోజును చాలా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాడు .

ఇదే క్రమంలో తారక్ బర్త్డ డే సందర్భంగా ఆయనకి ఇష్టమైన వాటి గురించి తెగ సెర్చ్ చేసి ప్రచారం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఇదే క్రమంలో ఓ సీనియర్ హీరోయిన్ అంటే తనకు క్రష్ అన్న విషయాన్ని గతంలో తారక్ చెప్పిన వీడియోని ట్రెండ్ చేస్తున్నారు. గతంలో ఓ షో కి హాజరైన తారక్ ..”తనకు శ్రీదేవి గారు అంటే చాలా చాలా ఇష్టమని ..క్రష్ అని .. వయసులో పెద్దది కావడంతో తాత పాత్రలో అయినా సరే ఆమెకు జోడిగా చేయాలి అనే డ్రీమ్ ఉంది అంటూ చెప్పుకొచ్చాడు”.

” ఎప్పటికైనా ఆమెతో ఒక్క సినిమాలోనైనా.. స్క్రీన్ షేర్ చేసుకోవాలి అని తన మనసులోని కోరికను బయట పెట్టాడు” . అయితే ఆ కోరిక తీరని లేదు.. బాత్ టబ్ లో పడి అతిలోకసుందరి శ్రీదేవి అనుమానాస్పద స్థితిలో మరణించింది. నిజానికి ఎన్టీఆర్ ఆ మాటలు మాట్లాడే టైంకి శ్రీదేవి బ్రతికే ఉన్నారు. ఆ తర్వాత ఎందుకో వీళ్ళ కాంబోలో సినిమాని తెరకెక్కించడానికి డైరెక్టర్ ఇంట్రెస్ట్ చూపించలేదు . రీసెంట్గా ఆయన సందర్భంగా అదే వీడియోని మళ్ళీ ట్రెండ్ చేస్తున్నారు . అయితే తల్లితో స్క్రీన్ షేర్ చేసుకోకపోయినా పర్లేదు .. కూతురు జాన్వి కపూర్ తో దేవర సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు . ఇలా అయినా తన కోరిక తీర్చుకున్నట్లే అంటున్నారు ఫ్యాన్స్..!!!