తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ బిజీలైనప్‌తో వతుససినిమాలలో నటిస్తున్నాడు. అందులో భాగంగా కమలహాసన్ నిర్మాతగా రాజ్ కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై తెరకెక్కుతున్న సినిమా అమరాన్. మరొ మూవీ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్లో తెరకెక్కుతుంది. ఇక అమరాన్ సినిమాలో శివ కార్తికేయన్ సైనికుడిగా ఓ పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుదిదశలో ఉంది.
ఇక తాజాగా ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్లో ఎస్కె 23 సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రెండు కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కనున్న యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీలే కావడం విశేషం. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శివకార్తికేయన్.. టాలీవుడ్ హీరోయిన్స్ శ్రీలీలతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేశారు. అయితే వీళ్ళు ఈ డ్యాన్స్ స్టెప్స్‌తో అదరగొట్టింది సినిమా కోసం కాదు.. ఓ స్టేజ్ పై ఇటీవల తిరుచిలోని ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో.
అతిథులుగా పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా శివ కార్తికేయన్, శ్రీలీల గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి సాంగ్‌కు స్టెప్స్ వేసి ప్రేక్షకులను అలరించారు. ఈ వీడియో ఇప్పుడు నెటింట వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిన శ్రీ లీల.. కోలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.
#PrinceSK and #Sreeleela shakes legs for #KurchiMadathaPetti !🔥🕺🏻💃🏻
This combo would shatter the screens ! Make it happen @Siva_Kartikeyan naahh!💥❤️#Amaran #SK23 pic.twitter.com/Nya09oDRq9
— ꜰᴀᴢɪʟ🖤 (@SKFazil_) March 23, 2024