ఆ కోలీవుడ్ స్టార్ హీరోతో కలిసి కుర్చీ మడతపెట్టిన శ్రీలీల.. వీడియో వైరల్..

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ బిజీలైన‌ప్‌తో వ‌తుస‌సినిమాల‌లో న‌టిస్తున్నాడు. అందులో భాగంగా కమలహాసన్ నిర్మాతగా రాజ్ కుమార్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై తెర‌కెక్కుతున్న సినిమా అమరాన్. మరొ మూవీ ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతుంది. ఇక‌ అమరాన్ సినిమాలో శివ కార్తికేయన్ సైనికుడిగా ఓ పవర్ఫుల్ పాత్ర‌లో కనిపించనున్నాడు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ తుదిద‌శ‌లో ఉంది.

ఇక తాజాగా ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్‌లో ఎస్‌కె 23 సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రెండు కమర్షియల్ ఫార్మాట్‌లో తెర‌కెక్క‌నున్న‌ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీలే కావడం విశేషం. ఈ క్ర‌మంలో రెండు రోజుల క్రితం శివకార్తికేయన్‌.. టాలీవుడ్ హీరోయిన్స్ శ్రీలీలతో కలిసి డ్యాన్స్ స్టెప్పులు వేశారు. అయితే వీళ్ళు ఈ డ్యాన్స్ స్టెప్స్‌తో అదరగొట్టింది సినిమా కోసం కాదు.. ఓ స్టేజ్ పై ఇటీవల తిరుచిలోని ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో.

అతిథులుగా పాల్గొని సందడి చేశారు. ఇందులో భాగంగా శివ కార్తికేయన్‌, శ్రీ‌లీల‌ గుంటూరు కారంలోని కుర్చీ మడత పెట్టి సాంగ్‌కు స్టెప్స్ వేసి ప్రేక్షకులను అలరించారు. ఈ వీడియో ఇప్పుడు నెటింట వైరల్‌గా మారింది. కాగా ప్రస్తుతం టాలీవుడ్ క్రేజీ బ్యూటీగా మారిన శ్రీ లీల.. కోలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది.