డి ఎస్ పి వల్లే నేను బ్యాచిలర్గా ఉండిపోయా.. హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్..

బుల్లితెరపై భారీ పాపులారిటి దక్కించుకున్న కామెడీ షో జబర్దస్త్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీస్ గా పాపుల‌ర్ అయ్యారు. అలాంటి వారిలో హైపర్ ఆది ఒకరు. ఈయన చేసే ప్రతి షోకు హైలెట్గా నిలుస్తూ ఉంటాడు. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కెరీర్ పరంగా విజ‌యాల‌ను అందుకుంటూ దూసుకుపోతున్నాడు హైపర్ ఆది.. పెళ్లి విషయంలో మాత్రం చ‌ప్పుడు చేయ‌డు. 33 ఏళ్ళ వ‌య‌స్సు వచ్చినా ఇంకా పెళ్లి వైపు ఆయన ధ్యాసమల్లడం లేదు. హైపర్ ఆది వివాహం చేసుకుంటే చూడాలని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే హైపర్ ఆది ఇండస్ట్రీకి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటారో లేదా మరో యువతని పెళ్లి చేసుకుంటారు వేచి చూడాలి. ఇక‌ అసలు విషయానికి వస్తే హైపర్ ఆది ఓ ఈవెంట్లో మాట్లాడుతూ డిఎస్‌పి వ‌ల్లే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.తాజాగా గామా టాలీవుడ్ మూవీ అవార్డ్స్ 2024 సెల‌బ్రేష‌న్స్‌ దుబాయ్ లో ఘ‌నంగా జ‌రిగాయి. అందుకు సంబంధించిన ప్రోమో ఇటీవ‌ల రిలీజ్ అయ్యింది. ఇక త్వరలో ఈ ఈవెంట్ బుల్లితెరపై టెలికాస్ట్ కానుంది. ఈ ఈవెంట్‌లో సుమ, అశ్వనీదత్ ను కల్కి మూవీకి సంబంధించిన అప్ డేట్ చెప్పాల‌ని అడిగింది. ఇక ఈ ఈవెంట్లో మంచు మనోజ్, తేజ సజ్జా, థమన్, మరి కొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారైసంద‌డి చేశారు.

ప్రోమోను చూస్తే ఇది అర్థమవుతుంది. ఇక ఈ ప్రోగ్రంలో ఆది మాట్లాడుతూ డిఎస్‌పి.. ఒకసారి వన్ సైడ్ లవ్వే రా ఎంతో బెటర్ అంటారని, మరోసారి లవ్ చేయాలా.. వద్దా.. అంటారని ఈ రెండిట్లో ఏది చేయాలో అర్థం కాక సింగిల్ గానే మిగిలిపోయాను అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. వెంటనే దీనికి డిఎస్పీ కౌంటర్ ఇచ్చారు. అందుకే నేను ఇంకా పెళ్ళి చేసుకోలేద‌ని వివ‌రించాడు. ఈ ప్రోమో ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది. ఇక హైపర్ ఆది ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు పలు సినిమాల్లో బిజీగా గ‌డుతున్నాడు ఆయన రెమ్యూనరేషన్ భారీ రేంజ్‌లో ఉంది. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న హైపర్ ఆది.. త‌న సినిమాతో మంచి సక్సెస్ అందుకోవాలని ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారు. రోజురోజుకు హైపర్ ఆది అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతూనే ఉంది.