బాలయ్య సినిమాలో ఆ ఒక్క సీన్ కట్ చేసి ఉంటే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేదా.. ?!

ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ బాలకృష్ణ తనదైన రీతిలోల ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా ఆయన నటించిన భగవంత్ కేసరి దసరా కానుకగా రిలీజై సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ఈయన మరో సినిమాలో నటిస్తున్నాడు. ఎన్బికె 109 టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. మొత్తానికి బాలయ్య ప్రస్తుతం స్టార్ హీరోగా బిజీ లైఫ్ ను లీడ్ చేస్తున్నాడు.

వరుస‌ సినిమాలో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇక గతంలో బాలకృష్ణ నటించిన ఓ సినిమాలో ఒకే ఒక్క సీన్ వల్ల సినిమా ప్లాప్ అయిందని.. దానిని కట్ చేసి ఉంటే సినిమా సూపర్ హిట్ అయ్యేది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమా ఏంటో.. అస్సలు ఏం జరిగిందో.. తెలుసుకుందాం. ఇక బాలయ్య గతంలో రాంప్రసాద్ డైరెక్షన్లో సీమ సింహం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య బాబు ఈ మూవీలో తనకు ఒక చెయ్యి పోయిన తర్వాత ఉండే కొన్ని సీన్లలో నటించాడు. అయితే ఈ సీన్లు సినిమాలో లేకపోయి ఉంటే సినిమా బ్లాక్ బస్టర్ హీట్ అయ్యేది అంటూ అభిమానులతో పాటు చాలామంది సినీ ప్రముఖులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

బాలయ్య హీరోగా నరసింహనాయుడు సినిమా బ‌చ్చి సూపర్ డూపర్ సక్సెస్ సాధించడంతో దీని తరువాత రిలీజైన‌ సీమ సింహం సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైప్‌ నెలకొంది. అయితే ఓ రేంజ్ లో బాలయ్య సినిమాను ఊహించుకుని థియేటర్స్ కు వచ్చిన ఆడియన్స్ కు బాలకృష్ణ చెయి పోవడం ఆ తర్వాత తెరకెక్కించిన సీన్స్ బాగా డిసప్పాయింట్ చేశాయట‌. ఈ సినిమా ఫ్లాప్ కు ఆ సన్నివేశాలు ఉండడమే కారణం అని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఫ్లాప్ తర్వాత బాలయ్యకు దాదాపు 8 సంవత్సరాలు పాటు సక్సెస్ రాలేదు. ఒకవేళ ఈ సినిమా హిటై ఉంటే అప్పట్లో బాలయ్య క్రేజ్ ఎవరు టచ్ చేయని రేంజ్‌కి ఎదిగేది అనడంలో అతిశయోక్తి లేదు.