వయసులో 10 ఏళ్ళు చిన్నోడిని పెళ్లాడ బోతున్న స్టార్ హీరోయిన్.. ఘోరంగా తిడుతున్న ఫ్యాన్స్..!

బాలీవుడ్ లో స్థిరపడిన కృతి సనన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ నేనొక్కడినే అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్నంత ఫలితం దక్కకపోవడంతో ఈమెకి సైతం తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అనంతరం నాగ చైతన్యతో దోచేయ్ అనే మూవీ మరియు ప్రభాస్ తో ఆదిపురుష్ వంటి మూవీస్ లో నటించినప్పటికీ ఈమెకి సరైన హిట్ టాలీవుడ్ లో రాలేదు.

ఈ క్రమంలోనే తిరిగి బాలీవుడ్ కి చేరుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బాలీవుడ్ లో పలు సినిమా ఆఫర్లు అందుకోవడంతో పాటు స్టార్ హీరోయిన్గా గుర్తింపు సైతం పొందింది. ప్రస్తుతం కృతి సనన్.. కరీనా కపూర్, టబు కలిసి నటించిన క్రూ మూవీ మార్చ్ 29న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృతి తన అందచందాలను ఆర్బోస్తూ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా కృతి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కృతి తన కన్నా పదేళ్ల వయసులో చిన్నోడైన కుర్రోడిని ప్రేమిస్తున్నట్లు బాలీవుడ్ వార్తలు చెబుతున్నాయి.

ఆమె రీసెంట్ గా వీకెండ్ హాలిడే కోసం లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ఒక అబ్బాయి తో ఈమె చట్టపట్టలేసుకుంటూ తిరగడం ఆ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో సైతం అప్లోడ్ చేయడం వంటివి చేసింది. ఇక ఆ ఫోటోలు వెనుక వైపు నుంచి ఉండడంతో వ్యక్తి ఎవరు అనే బాలీవుడ్ మీడియా ఆరా తీయడం మొదలు పెట్టింది. ఇక అబ్బాయి పేరు కబీర్. ఆ అబ్బాయికి 23 ఏళ్లు అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం కృతికి 33 ఏళ్లు. అలా తనకంటే పదేళ్ల వయసులో చిన్నోడైన వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతుంది కృతి.