త్రిప్తితో డేటింగ్ చేయాలని ఉంది.. యానిమల్ నటుడు ఇంటరెస్టింగ్ కామెంట్స్..

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో చివరగా తెరకెక్కిన మూవీ యానిమల్. ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో రిలీజై ఎలాంటి సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతేడాది బ‌చ్చిన ఈ మూవీ రికార్డ్ స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, నేషనల్ క్రష్‌ రష్మిక మందన జంటగా మెప్పించారు. అనిల్ కపూర్, బాబీ డియోలో, సిద్ధాంత్ కర్ణిక్, త్రిప్తి డిమ్రి కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్, రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సక్సెస్ సాధించిన.. తీవ్ర విమర్శలను ఎదుర్కొన సంగ‌తి తెలిసిందే.

ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది ఈ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే వచ్చిన విమర్శలు అన్నింటిని తిప్పికొడుతూ సందీప్ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే పాన్ ఇండియా మూవీగా వ‌చ్చిన‌ ఈ సినిమా మ్యూజిక్ పరంగాను, స్టోరీ పరంగాను మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో జోయా పాత్రలో బాలీవుడ్ నటి త్రిప్తి నటించి హైలెట్గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక మెయిన్ హీరోయిన్ అయినా.. త్రిప్తి ఆమెను మించి క్రేజ్ ద‌క్కించుకుంది. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ కుర్రకారును ఆకట్టుకుంది.

అలాగే జోయపాత్రలో కనిపించిన త్రిప్తి దిమ్రీకి ఒక్కసారిగా అమాంతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఒకసారిగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ అందుకున్న త్రిప్తి కుర్రాళ్లకు క్రేజీ క్రష్ గా మారిపోయింది. ఈ సినిమా తర్వాత ఆమెకు బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ కి కడుతున్నాయి. ప్రస్తుత ఈ బ్యూటీ చేత నిండా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసింది. ఈ క్రమంలో యానిమల్ లో రణ్బీర్ కపూర్ బావ వరుణ్ ప్రతాప్ మల్హోత్రా రోల్లో మెప్పించిన సిద్ధాంత్‌కర్ణిక్.. త్రిప్తిపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ఓ ఇంటర్వ్యూలో సందడి చేసిన సిద్ధాంత్ మాట్లాడుతూ యానిమల్ లో జోయాతో తనకు డేటింగ్ చేయాలని ఉందంటూ వివరించాడు. అయితే దానికి కారణం కూడా చెప్పుకొచ్చాడు. నా మాటలు కాంట్రవర్షిగా రూపొదిద్ద‌కండి. ఈ విషయాన్ని నేను బహిరంగంగానే చెప్పాను. నా ఉద్దేశంలో ఏమి తప్పులేదు.. త్రిప్తిని కాఫీ కోసం బయటకు తీసుకువెళ్లాలని ఉంది. తన కోసం నేను సంతోషంగా బిల్ చెల్లిస్తా అంటూ వివరించాడు. ఇక రీల్ లైఫ్ రియల్ లైఫ్ ని వేరువేరుగా చూడాలంటూ ఆయన చేసిన‌ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సిద్ధాంత్ కర్ణిక్‌ గతంలో పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ సినిమాలోను న‌టించారు.