ఆ స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన ఆలియా భట్.. లక్ అంటే ఇది కదా..!

అలియా భట్.. పరిచయం అవసరంలేని పేరు. నిత్యం తన అందచందాలను సోషల్ మీడియాలో ఆరబోస్తూ ఎప్పటికప్పుడు మంచి పాపులారిటీ సంపాదించుకుంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం కొట్టేసింది. మరి ఆ స్టార్ హీరో మరెవ్వరో కాదు మహేష్ బాబు.

ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ భారీ డిజాస్టర్ ని వెలుగు చూశాడు. ఇక ప్రస్తుతం రాజమౌళి తో మహేష్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ లో ఒక్క డిజాస్టర్ ని కూడా వెలుగు చూడని రాజమౌళి.. మహేష్ తో సినిమా చేయడంతో ప్రతి ఒక్కరి ధ్యాస ఈ కాంబినేషన్ పై మళ్లీంది.

ఇక ఈ మూవీ ఇటు మహేష్ మరియు అటు రాజమౌళి ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీలో ఆలియా భట్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఈ మూవీలో కనుక నిజంగా అలియా నటిస్తే తన కెరీర్ పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్లలో ఒకరైన ఆలియా భట్ ఈ మూవీలో అవకాశం దక్కించుకుంది అంటూ అనేక ప్రచారాలు జరుగుతున్నాయి.