బొప్పాయి ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉన్న ఈ పండు.. చూడడానికి ఆకర్షణీయంగా.. తినడానికి రుచిగా ఉంటుంది. దీన్ని పిల్లలనుంచి పెద్దవారి వరకు.. ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టంగా తీసుకుంటూ ఉంటారు. అందుకే బొప్పాయి పండును డైట్ లో చేర్చుకుంటే అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు. సాధారణంగా భోజనం తర్వాత ఫ్రూట్స్ తినకూడదని చెబుతూ ఉంటారు. కానీ బొప్పాయి తింటే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కరుగుతాయి. చాలామంది భోజనం చేసిన వెంటనే కడుపుబ్బరం, గ్యాస్, ఎసిడిటీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు.
అలాంటి వాళ్ళు భోజనం తర్వాత కొన్ని బొప్పాయి పండు ముక్కలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ పండ్లలో పాపైన్ సమృద్ధిగా లభిస్తుంది. ఇది ప్రోటీన్లను స్వేకరించడంలో అలాగే జీర్ణ క్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. భోజనం తర్వాత బొప్పాయి తినడం వల్ల కడుపుబ్బరం, అజీతి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేగు కదలికలను మెరుగుపరిచి.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి సహకరిస్తుంది.
మలబద్ధక సమస్యకు చెక్ పెడుతుంది. అలాగే బొప్పాయి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఈ బొపాయి క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులో ఉండే లైకోఫిన్, బీటా కెరోటిన్లు, కెరటనాయిడ్స్ ఇలాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు గర్భాసయ్య, రొమ్ము, కాలేయ, ఊపిరితిత్తులు, ఫ్యాంక్రియాస్ ఇలా ఎన్నో రకాల క్యాన్సర్ల నుంచి కాపాడతాయి. బొప్పాయిలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు, మధుమేహం, అధిక రక్తపోటు లాంటి వ్యాధులకు వ్యతిరేకంగా పోరాడి మనలను రక్షిస్తుంది. బొప్పాయిలో ఉండే బీటా కేరోటిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఫైబర్ మరియు పొటాషియం హార్ట్ ప్రాబ్లమ్స్‌కు చెక్ పెడతాయి.