ప్రభాస్ తో సినిమా హిట్ అవ్వాలని ఆ పని చేసిన సందీప్ వంగ.. హ్యాట్సాఫ్ అంటున్న ఫ్యాన్స్..!

సందీప్ రెడ్డి వంగ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకే కాదు డైరెక్టర్లకి కూడా మంచి గుర్తింపు దక్కుతుంది అనే పేరుకి అర్థం చెప్పాడు సందీప్ వంగ. తన డైరెక్షన్ తో ప్రతి ఒక్కరిని ఆకర్షించారు. అదేవిధంగా తన గట్స్ చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు కూడా. ఎవ్వరికి జడవడు ఇండస్ట్రీలో నుంచి నిన్ను బ్యాన్ చేస్తారన్న పట్టించుకోడు.

ఈ ఇండస్ట్రీ కాకపోతే మరొక ఇండస్ట్రీ అంటూ తన పని తాను చూసుకుంటూ పోతాడు. అటువంటి సందీప్ వంగా ఇటీవలే యానిమల్ సినిమాతో ప్రేక్షకుల మందికి వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్నాడు. ఇక ఈ సినిమాతో మరోసారి సందీప్ గా పేరు మారు మోగింది. ప్రస్తుతం ఈయన డైరెక్షన్లో ప్రభాస్తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై రెబల్ స్టార్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్ ప్రతి ఒక్కరిని ఆకర్షించాయి.

మరి కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా సందీప్ రెడ్డి వంగ స్క్రిప్ట్ మూవీ హిట్ అవ్వాలని పెద్ద తిరుపతి వెళ్లి గుండు కొట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ” నేను ప్రతి ఏడాది ఇక్కడికి వస్తా. ఈసారి కొంచెం లేట్ అయింది అంతే. త్వరలో స్క్రిప్ట్ మూవీ స్టార్ట్ కానుంది ” అంటూ కూడా అక్కడున్న మీడియాతో వెల్లడించాడు. ఇక ఈయన డెడికేషన్ చూసిన కొందరు శభాష్ అంటున్నారు.