చరణ్ నటించిన ఆ సినిమా అంటే సురేఖాకు ఎందుకు అంత కోపం..? ఆ మూవీ వస్తే టీవి పగలకొడుతుందా..?

ఎస్ .. ఈ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగాస్టార్ చిరంజీవి వన్ అండ్ ఓన్లీ సన్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎలాంటి స్థానం దక్కించుకున్నాడో మనకు తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న చరణ్.. ప్రజెంట్ గ్లోబల్ స్థాయిలో సినిమాలను ఓకే చేస్తున్నాడు . హాలీవుడ్ డైరెక్టర్స్ కూడా చరణ్ తో సినిమాలు తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు.

ఇలాంటి మూమెంట్లోనే చరణ్ ఓ సినిమాలో నటించినందుకు సురేఖ చాలా హర్ట్ అయిందని .. ఇక అలాంటి సినిమాలు తీయొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చిందట . ఆ సినిమా మరేదో కాదు. చరణ్ పోలీస్ ఆఫీసర్గా నటించిన “తుఫాన్” . రామ్ చరణ్ పోలీస్ అధికారి పాత్రలో బాగా చేసినప్పటికీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే సినిమాలో కధా.. కంటెంట్ బాగాలేదు అని కొందరు అంటే రామ్ చరణ్ పర్ఫామెన్స్ దరిద్రంగా ఉంది అంటూ మరికొందరు చెప్పారు.

నిజంగానే రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అంతగా ఆకర్షణీయంగా లేదు అని సురేఖ ఆయనకు చెప్పిందట . అంతేకాదు ఇలాంటి సినిమాలు చూస్ చేసుకోవద్దు అంటూ ముఖాన్నే చెప్పేస్తుందట . అమితాబచ్చన్ హీరోగా వచ్చిన జంజీర్ చిత్రానికి రీమేక్ గా ఈ తుఫాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది . అయితే ఏం లాభం తెలుగులోను హిందీలోనూ అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది ఈ సినిమా..!!