ఎన్టీఆర్, మహేశ్ పై అలా.. పవన్ పై ఇలా.. ఫ్యాన్స్ కి మండిస్తున్న సమంత కామెంట్స్..!!

సమంత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఓ రేంజ్ లో మారు మ్రోగిపోతుంది. ఒక టాప్ సెలబ్రిటీ పేరు మారుమ్రోగిపోవడం కామన్ నే. అయితే విడాకులు తీసుకున్న తర్వాత ఫస్ట్ నెగెటివిటీతో కూడుకొని .. ఆ తర్వాత పాజిటివిటీతో కూడుకున్న కామెంట్స్ దక్కించుకోవడం చాలా చాలా రేర్ . ఆ విషయంలో సమంత తర్వాతే మరి ఎవరైనా అని చెప్పక తప్పదు.

రీసెంట్ గా సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . హీరోయిన్ సమంత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ హీరోలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సెన్సేషనల్ గా మారిపోయాయి. హీరోయిన్ సమంత టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరి స్టార్స్ తోను స్క్రీన్ షేర్ చేసుకుంది. వీళ్ళల్లో కొందరి గురించి మాట్లాడుతూ రకరకాల ట్యాగ్స్ ఇచ్చింది.

దానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది . అయితే మహేష్ బాబు కి మోస్ట్ డైజైరబుల్ అని ట్యాగ్ ఇచ్చిన సమంత.. ఎన్టీఆర్ కి గ్రేట్ డ్యాన్సర్ అంటూ ట్యాగ్ ఇచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు చెప్పేసరికి మాత్రం ..”మై గురు” అంటూ చెప్పుకొచ్చింది . దీంతో సోషల్ మీడియాలో సమంత కామెంట్స్ వైరల్ గా మారాయి . సమంత పవన్ కళ్యాణ్ ని ఓ దేవుడు లా భావిస్తుంది అంటూ పవన్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తూ ఉంటే .. మిగతా హీరో ఫ్యాన్స్ మాత్రం ఆమెపై మండిపడుతున్నారు..!!