ఇటీవల కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోస్ గా క్రేజ్‌ను సంపాదించుకుంటున్న నటులు తమ జీవితకాలంలో 50 సినిమాలకు పైగా చేస్తే గ్రేట్ అనే పరిస్థితి ఏర్పడుతుంది. స్టార్ హీరోలు ఒక్క సినిమాకు రెండు నుంచి మూడు ఏళ్ల సమయం ఈజీగా పట్టేస్తుంది. ప్రతి యంగ్ జనరేషన్ స్టార్ హీరో ఐదేళ్లలో కేవలం రెండు లేదా మూడు సినిమాల్లో మాత్రమే నటిస్తూ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. ఎంత వేగంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసినా.. ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా సాధ్యం కాని పరిస్థితి. అలాంటి క్రమంలో ఈ జనరేషన్లో 150కి పైగా సినిమాల్లో నటించి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు చిరంజీవి.
ఇప్పటివరకు ఉన్న ఈ జనరేషన్ స్టార్ హీరోస్ ఎవరు ఇలాంటి రికార్డును క్రియేట్ చేయలేకపోయారు. కనీసం టచ్ కూడా చేయలేకపోయారు. ఇకపై కూడా ఈ జనరేషన్ హీరోస్ ఎవరు చిరు సాధించిన ఆ రేర్ రికార్డును బ్రేక్ చేయలేరంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిరంజీవి తన కెరీర్ స్టార్టింగ్ లో ఎక్కువ సంఖ్యల సినిమాల్లో నటించడంతో ఈ రికార్డ్ సాధ్యమైంది. అప్పట్లో హీరోలు నెలకు ఒక సినిమా షూటింగ్ పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేసేవారు. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు చాలా మారిపోయాయి. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ప్రయత్నిస్తున్నాడు చిరు. రూ.60 నుంచి 100 కోట్ల రేంజ్లో రెమ్యూనరేషన్లు అందుకుంటూ వరుస సినిమాల్లో నటిస్తున్న చిరంజీవి.. అభిమానులకు మరింత దగ్గరవుతున్నాడు. కెరీర్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ సీనియర్ హీరో నెక్స్ట్ లెవెల్ సినిమాలతో ఈ జనరేషన్ ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి ఇతర భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేసే విషయంపై ఫోకస్ చేశారు. ఈ మూవీకి సక్సెస్ వస్తే కెరీర్ పరంగా చిరంజీవి మరింత సక్సెస్ సాధించడం ఖాయమని తెలుస్తోంది. యంగ్ జనరేషన్ హీరోలకు కూడా చిరంజీవి తన సినిమాలతో ఛాన్స్ లు ఇస్తున్నాడు.