అవును నేను వాటి షేప్స్ కోసం అలాంటి సర్జరీ చేయించుకున్నా.. అనన్య నాగళ్ళ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనన్య నాగళ్ళ మల్లేశం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే మంచి నటనను కనబరిచి.. తన సత్తా చాటుకున్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఓ హీరోయిన్గా నటించి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈ సినిమా అనన్య సినీ కెరీర్‌లో మంచి బ్రేక్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో భారీ పాపులారిటి ద‌క్కించుకున్నప్పటికీ అనన్యకు అవకాశాలు మాత్రం ఊహించిన రేంజ్ లో దక్కలేదు. దీంతో సినిమా అవకాశాల కోసం తానే కష్టపడడం మొదలుపెట్టింది. అందాల ఆరబోతలను నేనేం తక్కువ కాదు అంటూ రెచ్చిపోయింది. అన్ని పాత్రల్లో నేను చేయగలను అనే విధంగా హాట్ ఫోటోషూట్లతో డైరెక్టర్లకు హింట్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం అనన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ తంత్ర. మార్చి 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారర్ థ్రిల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టైలర్, పోస్టర్ ప్రేక్షకులకు వనుకుపుట్టే విధంగా రూపొందించారు. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన అన‌న్య‌ వరుస ఇంటర్వ్యూలో సందడి చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించినా.. అలాగే తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ దావత్ అనే షోలో పాల్గొని సందడి చేసింది. అందులో తన సర్జరీకి సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్స్ తమ గ్లామర్ కాపాడుకోవడానికి సర్జరీలు చేయించుకుంటున్నారంటూ ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అందులో కొంతమంది దానిని ఒప్పుకుంటారు కూడా.. మీరు ఎప్పుడైనా అలాంటి సర్జరీ చేయించుకున్నారా అంటూ అనన్యకు ప్రశ్న ఎదురైంది.

దానిపై అనన్య స్పందిస్తూ నిర్మొహమాటంగా అవును చేయించుకున్నాను అంటూ ఒప్పుకుంది. నేను లిప్ పిల్లర్ వేయించాను అది వేసి రెండేళ్లు అవుతుంది.. ఇప్పుడు పోయినట్టుంది అని వివరించింది. లిప్ ఫిల‌ర్ అంటే పెదాలు షేప్ వచ్చేలా చేసే ఓ చిన్న సర్జరీ. ఇక ఇండస్ట్రీలో ఉండే కొన్ని కష్టాల గురించి ఆమె వివరించింది. కార్లు, అసిస్టెంట్లు ఉన్నప్పుడు ఆ సెలబ్రెటీస్ ను వేరే విధంగా చూస్తారని.. అవి లేని వారిని అసలు పట్టించుకోరని చెప్పుకొచ్చింది. ఇక సమంత, అలియా భట్ తనకు ఇన్స్పిరేషనల్ హీరోయిన్స్ అని వివరించింది అనన్య. ఒక్క‌ సినిమాతో హిట్ కొడితే అందరూ నన్ను గుర్తుపట్టి మాట్లాడతారు అనుకున్నానని.. కానీ ఆ హ్యాపీనెస్ బయట ఏమి నాకు కనిపించలేదంటూ వివరించింది అనన్య. ప్రస్తుతం ఈ చిన్న‌ది చేసిన కామెంట్స్ నెట్టింట‌ వైరల్‌గా మారాయి.