వావ్ : బాలయ్యతో ఏ డైరెక్టర్ చేయలేని పని చేసిన అనిల్ రావిపూడి.. ట్రెండింగ్ లోకి భగవంత్ కేసరి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుని గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని ..ఒక్క సినిమాకి 100 కోట్లు – 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్న ..బాలయ్యతో ఎవ్వరు సరి సమానంగా నిలవలేరనే చెప్పాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోలు ఎలా సినిమాలను చూస్ చేసుకుంటున్నారో.. ఎంత ఫాస్ట్గా సినిమాలను తెరకెక్కిస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే యంగ్ హీరోలకి ధీటుగా బాలయ్య సైతం సంవత్సరానికి రెండు మూడు సినిమాలను కన్ఫామ్ చేస్తూ.. కన్ఫామ్ అయిన సినిమాలను సెట్శ్ పైకి తీసుకొస్తూ త్వరగా రిలీజ్ చేసి అభిమానులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు .

కేవలం ఫైట్లు.. డాన్సులు.. డైలాగ్స్లే కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ కంటెంట్ కూడా ఇస్తున్నారు . ఆ విషయంలో బాలయ్య తర్వాతే మరి ఏ హీరో అయినా అని చెప్పాలి. అయితే మిగతా హీరోలతో కంపేర్ చేస్తే..బాలయ్య డాన్స్ విషయంలో కూసింత తక్కువనే చెప్పాలి . అందరికీ ఈ విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఏ స్టార్ డైరెక్టర్ బాలయ్యతో చేయని సాహసాన్ని అనిల్ రావిపూడి బాలయ్యతో భగవంత్ కేసరి అనే సినిమాలో చేయించాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాలో వచ్చే హాట్ ఐటమ్ సాంగ్ లో బాలయ్య ఏకంగా ఫ్లోర్ స్టెప్ వేసాడట . దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది అంటూ ప్రచారం జరుగుతుంది . హీరోయిన్తో సరి సమానంగా బాలయ్య డూప్ లేకుండా ఒరిజినల్ గా ఫ్లోర్ స్టెప్ చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అల్లు అర్జున్ – రామ్ చరణ్ – ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోలే ఫుల్ స్టెప్స్ వేస్తున్న ఇలాంటి టైం లో బాలయ్య వాళ్లకి ధీటుగా స్టెప్స్ వేయడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి. దీనితో సోషల్ మీడియాలో భగవంత్ కేసరి హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చింది..!!