కృతిశెట్టికి కోపం వచ్చింది”.. మీడియా ముందే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిందిగా..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ వార్త నిజం ..ఏ వార్త అబద్దం అని ..తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది . మరి ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ విషయాలలో ఉన్నవి లేనివి ఎక్కువగా వైరల్ గా మారుతున్నాయి . ఈ క్రమంలోనే కృతి శెట్టి ని ఓ హీరో ఏడిపిస్తున్నాడు అని ..ఆమెతో టైం స్పెండ్ చేయమని బలవంతం చేస్తున్నారని ..కోట్లు ఆఫర్ చేస్తున్నాడని.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు మారుమ్రోగి పోతున్నాయి .

ఈ క్రమంలోనే టాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో కృతిశెట్టి పేరుని నానా విధాలుగా ట్రోల్ చేశారు ఆకతాయిలు. అయితే ఇన్నాళ్లు ఓపికగా చూసిన బేబ్బమ్మ.. ఫస్ట్ టైం కోపంతో రెచ్చిపోయింది . ఇలాంటి చెత్త రూమర్లు ఎలా క్రియేట్ చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అంటూ మండి పడిపోయింది . కాగా రీసెంట్ గా జయం రవి సినిమాలో ఆఫర్ అందుకున్న కృతి శెట్టి మీడియాతో ముచ్చటించింది .

ఈ క్రమంలోనే తనపై వస్తున్న రూమర్ పై క్లారిటీ ఇచ్చింది . “అసలు ఇలాంటి రూమర్స్ పట్టించుకోను ..కానీ బాగా స్ప్రెడ్ అయిపోతూ ఉండడంతో నా ఫాన్స్ కి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది కనుక రెస్పాండ్ అవుతున్నాను.. నన్ను ఏ హీరో బలవంతం చేయడం లేదు.. నా వెనక ఏ హీరో పడటం లేదు ..దయచేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త గురించి పట్టించుకోకండి”.. అంటూ క్లారిటీ ఇచ్చింది. ఇదే క్రమంలో ట్రోలర్స్ పై ఫైర్ అయింది . ఇలాంటి చెత్త వార్తలు ఎలా సర్కులేట్ చేస్తున్నారు అంటూ మండిపడింది . దీంతో సోషల్ మీడియాలో కృటి శెట్టి కామెంట్స్ వైరల్ గా మారాయి..!!