క్యాస్టింగ్ కౌచ్ పై ఎన్టీఆర్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట ప్రయాణం అనే సినిమా ద్వారా తన కెరియర్ను మొదలుపెట్టిన పాయల్ ఘోస్ ఆ తర్వాత ఎన్టీఆర్ తో ఊసరవెల్లి చిత్రంలో నటించింది.. మిస్టర్ రాస్కెల్ వంటి చిత్రాలలో నటించింది. కానీ ఎన్టీఆర్ తో నటించిన ఊసరవెల్లి సినిమా ద్వారానే ఈ అమ్మడు బాగా పాపులారిటీ సంపాదించింది. ఇందులో సెకండ్ హీరోయిన్ గా నటించినప్పటికీ ఈమె నటన అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఆ మధ్య ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలను కూడా చేసింది.

Junior NTR didn't have it easy, so shut up about nepotism: Payal Ghosh -  IBTimes India

తనను ఫిజికల్ గా ఇబ్బంది పెట్టాడంటూ పాయల్ ఘోస్ షాకింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. తాజాగా ఇప్పుడు మరొకసారి సంచలనాలకు తెరరేపే విధంగా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. తన 11వ సినిమాను ప్రకటించిన సందర్భంగా సోషల్ మీడియాలో ఈ విధంగా పేర్కొంటూ ఇది నా 11వ సినిమా ఒకవేళ నేను కొంతమంది అడిగినట్టుగా పడుకొని ఉంటే కచ్చితంగా ఇది నా 30వ సినిమా అయ్యేది అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది పాయల్ ఘోస్.. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ భారీగానే ఉందని ఆఫర్లు రావాలి అంటే కొన్ని వదులుకోవాలంటు తెలియజేసింది.

గతంలో ఈ క్యాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉండేది కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం జరగడం వల్ల జనాలలో అవగాహన రావడంతో కాస్త తగ్గిందని తెలియజేసింది.పాయల్ ఘోస్ మాత్రమే కాకుండా చాలామంది హీరోయిన్స్ చేతి వరకు వచ్చిన అవకాశాలను క్యాస్టింగ్ కౌచ్ కారణంగా పోగొట్టుకున్నారని తెలిపింది. తనకు ఎదురైన కొన్ని క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను సైతం చెబుతూ సోషల్ మీడియాలో ఎన్నోసార్లు పోస్ట్ షేర్ చేసింది పాయల్ ఘోస్.