అభిమానులను టెన్షన్ పెడుతున్న అల్లు అర్జున్.. తేడా కొడితే బొక్క బోర్లా పడాల్సిందేనా..?

ఏంటో ..ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు ఏం చేస్తున్నారో తెలియక అయోమయంలో చేసేస్తున్నారో.. లేక కావాలనే కెరీర్ ని రిస్క్ లో పెట్టుకోవడానికి చేస్తున్నారో అర్థం కావడం లేదు. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఉండే హీరోలు అందరూ ఒకరి తర్వాత ఒకరు కెరియర్ లో తప్పుటడుగులు వేసి బొక్క బోర్లా పడడానికి సిద్ధంగా ఉన్నారు. రీసెంట్ గానే ఇండస్ట్రీలో ఆ లిస్ట్ లోకి ఆడ్ అయిపోయాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ .

ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ హీరో ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ దక్కించుకొని ఉన్నాడు . కాగా పుష్ప 2 సినిమా షూట్ లో బిజీగా ఉన్న ఈ హీరో ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు . అయితే సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే డైరెక్టర్గా ఎదుగుతున్న శ్రీకాంత్ ఓదల డైరెక్షన్లో బన్నీ ఓ సినిమాకి ఫిక్స్ అయ్యాడన్న న్యూస్ అభిమానులకు మింగుడు పడడం లేదు.

బన్నీ రేంజ్ మారిపోయింది. పాన్ ఇండియా లెవెల్లో డైరెక్టర్లతోనే సినిమా చేస్తున్నాడు . అయితే అలాంటి బన్నీ ఒక్క సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం అభిమానులకు అర్థం కావడం లేదు. ఒకవేళ బన్నీ బాడీ మోడ్యుయేషన్ ని అర్థం చేసుకోలేకపోయినా.. కధ ఏమాత్రం తేడా కొట్టి ఫ్లాప్ అయినా.. బన్నీ కెరియర్ బొక్క బోర్ల పడాల్సిందే అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . దీంతో సోషల్ మీడియాలో బన్నీ పేరు వైరల్ గా మారింది..!!