రాజమౌళి ఫేవరేట్ హీరోయిన్ ఎవరో తెలుసా..? కానీ సినిమాలో మాత్రం పెట్టుకోడు..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. హీరోయిన్లు ఉన్న.. ప్రతి ఒక్క మనిషికి ..ప్రతి ఒక్క హీరోకి ఒక హీరోయిన్.. ఒక హీరో అంటే ఇష్టం ఉంటుంది . వాళ్ళ టెస్ట్ కి తగ్గట్టు అభిరుచులకు తగ్గట్టు హీరోలని హీరోయిన్లని ఇష్టపడుతూ ఉంటారు .అయితే చాలామంది ఇండస్ట్రీలో ఉండే పెద్దలకి ప్రముఖులకి చిన్నపిల్లలకి ఫేవరెట్ డైరెక్టర్ అయిన ఎస్ ఎస్ రాజమౌళి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు . మీరు అనుకోవచ్చు అంత పెద్ద డైరెక్టర్ కి ఏ హాలీవుడ్ లో ..ఏ బాలీవుడ్లో బ్యూటీ అంటే ఇష్టం ఉంటుంది అని ..

కానీ రాజమౌళి టేస్టే వేరు . అది ఆయన తెరకెక్కించే సినిమాలను చూస్తే అర్థమయిపోతుంది. కాగ గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనేది బయట పెట్టాడు . “గతంలో సావిత్రి అంటే చాలా ఇష్టమని.. ఆ తర్వాత సౌందర్య గారిని బాగా ఇష్టపడ్డానని ..ప్రజెంట్ కాలంలో హీరోయిన్ ఎవరు ఇష్టమంటే బాగా నచ్చేది నిత్యామీనన్ “అంటూ చెప్పకు వచ్చారు.

“చాలా నాచురల్ గా యాక్ట్ చేస్తుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఆమెతో సినిమాను తెరకెక్కించే ఆలోచన లేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. దానికి రీజన్ ఆమె కొంచెం హైట్ తక్కువగా ఉంటుంది . మిగతా హీరోలకి సూట్ అవ్వదు. నేను చూస్ చేసుకునే కథలకి భారీ బాడీ ఉన్న హీరోలే సూట్ అవుతారు.. అలా చూసుకుంటే నా డైరెక్షన్లో ఎప్పటికి నిత్యామీనన్ వర్క్ చేయలేదేమో ..కానీ ఆమె నటనని ఇష్టపడుతూనే ఉంటాను “అంటూ చెప్పుకొచ్చారట. దీంతో ఈ న్యూస్ వైరల్ గా మారింది..!!