నిహారిక దెబ్బ‌కు ఫుల్ డిప్రెష‌న్ లోకి వెళ్లిపోయిన చైత‌న్య‌.. ప్ర‌శాంత‌త కోసం ఎక్క‌డికి వెళ్లాడో తెలుసా?

మెగా డాటర్ నిహారిక కొణిదెల, ఆమె భర్త చైతన్య జొన్నలగడ్డ విడిపోయారని.. విడాకులు కూడా తీసుకున్నారని గత కొంతకాలం నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ నిహారిక‌, చైతన్య తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో పెళ్లి ఫోటోలు, ఇద్దరం కలిసి ఉన్న ఫోటోలను తొలగించారు. ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. అలాగే మెగా ఫ్యామిలీకి చైత‌న్య దూరంగా ఉంటున్నాడు.

ఇటీవల జరిగిన వరుణ్ తేజ్‌ నిశ్చితార్థం వేడుకలో కూడా చైతన్య జొన్నలగడ్డ కనిపించలేదు. దీంతో నిహారిక చైతన్య విడాకులు దాదాపు కన్ఫామ్ అయిపోయాయి. అయితే భ‌ర్త‌తో విడిపోయాక నిహారిక నటిస్తూ బిజీ అయింది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ అయింది. కానీ చైతన్య మాత్రం బయట ఎక్కడా కనిపించడం లేదు. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా లేడు. ఈ క్ర‌మంలోనే నిహారిక‌ దెబ్బకు చైతన్య ఫుల్ డిప్రెషన్ లో కూరుకుపోయాడని ప్రచారం జరిగింది.

అయితే దాదాపు నాలుగు నెలల తర్వాత చైతన్య ఓ పోస్ట్ పెట్టాడు. ముంబైలోని `గ్లోబల్ విపాసనా పగోడా` మెడిటేషన్ సెంటర్ లో ఉన్నాన‌ని తెలుపుతూ ప‌లు ఫోటోలు పంచుకున్నాడు. `ఇక్కడికి నన్ను వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్‌. గత 10 రోజులు గా నా లైఫ్ లోకి వచ్చిన ఈ విపాసపా యోగా వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియెన్స్. ఒక ప్రదేశానికి మనం ఎటువంటి అంచనాలు లేకుండా వెళ్లి ఎంతో జ్ఞానంతో తిరిగి వస్తాం. ఇది అలాంటిదే` అంటూ చైత‌న్య ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు. మొత్తానికి నిహారిక‌తో విడాకుల కార‌ణంగా బాధ‌లో ఉన్న చైత‌న్య‌.. ప్ర‌శాంత‌త కోసం మెడిటేషన్ సెంట‌ర్ కు వెళ్లాడ‌ని ఆయ‌న పోస్ట్ తో స్ప‌ష్టంగా తేలిపోయింది.

https://www.instagram.com/p/CuHTPhCS0YG/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==