సినిమా పరిశ్రమ అనేది ఎవరికీ సొత్తు కాదు. వారి వెనకాల ఎంతమంది స్టార్లు ఉన్నా స్టార్ హీరోయిన్స్ ఉన్న వారు తమని ప్రూఫ్ చేసుకుంటేనే ఇక్కడ హీరో, హీరోయిన్లుగా వారి కెరీర్ ని కొనసాగించగలరు. ఇదే క్రమంలో తమ కెరీర్ని తమ చేతులారా పాడు చేసుకున్న హీరోలు- హీరోయిన్లు కూడా ఉన్నారు. అటు వారి కుటుంబ సభ్యుల వల్ల కూడా తమ కెరీర్ని పాడు చేసుకున్న వారు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో అలనాటి స్టార్ హీరోయిన్స్ ఇద్దరు వారి పిల్లల జీవితాన్ని చేతులారా పాడు చేశారు.
స్టార్ హీరోయిన్ మంజుల అందరికీ తెలిసిందే. ఆమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్గా కొనసాగారు. ఆమెకు ముగ్గురు కూతుర్లు ఉన్నారు వారికి కొడుకులు లేకపోవడంతో. సినిమా పరిశ్రమలోకి వారి కూతుర్లను తీసుకురావాలని అనుకున్నారు. అనుకున్నవిధంగా ఆమె పెద్ద కూతురుని చిన్న వయసులోనే హీరోయిన్గా పరిచయం చేశారు. వనిత చిన్న వయసు కావచ్చు ఆమెకు ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో అమ్మ చెప్పిందని నామమాత్రంగా నటించింది.
అలా వనిత సినిమా పరిశ్రమలో హీరోయిన్గా ఉండలేక బయటకు వెళ్లలేక చాలా కష్టాలు ఎదుర్కొంది. చిన్న వయసులోనే చాలా పెళ్లిళ్లు చేసుకుని తెలియక తన జీవితాన్ని నాశనం చేసుకుంది. దీని వెనక అమ్మ మంజుల ప్లానింగ్ సరిగా లేకపోవడంతో ఆమెకు చాల మైనస్ అయ్యింది. మరో తెలుగు సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా రమణి సౌత్ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్గా వెలిగింది.
హీరో తరుణ్ ఆమె కొడుకు తన కొడుకుని కూడా స్టార్ హీరోని చేయాలని చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి పరిచయం చేసింది. తరుణ్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత తరుణ్ హీరోగా సినిమాలు చేసి సూపర్ హిట్లు అందుకున్నాడు. మంచి ఫామ్ లో ఉన్న టైంలో వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వల్ల హీరోగా తన కెరీర్ను నాశనం చేసుకున్నాడు. ఇలా వీరే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ ద్వారా సినిమా కెరీర్ను నాశనం చేసుకున్నవారు ఇంకా చాలామంది ఉన్నారు.