విజయ్‌ని వదిలేసి ఇంకో హీరోని తగులుకున్న రష్మిక.. ఎన్ని అఫైర్లు పెట్టుకుంటావ్ అంటూ!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మొన్నటివరకు రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక ప్రేమలో ఉన్నారనే ప్రచారం జోరుగా నడిచింది. అయితే ఇప్పుడు మాత్రం వీరిద్దరూ విడిపోయారనే ప్రచారం జరుగుతుంది. గీత గోవిందా, డియర్ కామ్రేడ్ లాంటి సినిమాలలో కలిసి నటించారు ఈ జంట. ఆ సినిమా షూటింగ్‌లో వారి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారిందని వార్తలు వచ్చాయి. అయితే రష్మిక మాత్రం వారిద్దరిది స్నేహానికి మించిన బంధం అని చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు ఏమైందో తెలీదు కానీ ఇద్దరి ప్రేమకు బ్రేకప్ అయిందని వార్తలు వస్తున్నాయి.

గత కొన్నేళ్లుగా విజయ్, రష్మికకి దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. విజయ్ ప్రేమకు బ్రేకప్ చెప్పిన రష్మిక మరో టాలీవుడ్ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్నట్లు టాక్. అయితే ఆ టాలీవుడ్ హీరో ఎవరో కాదు బెల్లంకొండ శ్రీనివాస్. ఇటీవలే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో బెల్లంకొండ శ్రీనివాస్, రష్మిక మందన ఇద్దరు కలిసి కనిపించడంతో కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఒక ఈవెంట్ కి రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్ ముంబైకి వెళ్లారు.

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వీరిద్దరూ ఫోటోలకు ఫోజులు ఇచ్చి, కొంతమంది అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ముంబైలో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అంతేకాకుండా ముంబై ఈవెంట్ లో వీరిద్దరూ కాస్త క్లోజ్ గా కనిపించరట. దాంతో వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అభిమానుల మధ్య అనుమానాలు మొదలయ్యాయి. వారు డేటింగ్ లో కూడా ఉన్నారని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం రష్మిక పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప -2 లో నటిస్తుంది. అలానే నితిన్ – వెంకీల కుడుముల మూవీలో నటిస్తోంది. ఇక హిందీలో యానిమల్ మూవీ లో కూడా నటిస్తుంది. మరోవైపు ఛత్రపతి సినిమా రీమేక్ గా వస్తున్న సినిమా తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. వి. వి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందు రానుంది.