టీడీపీలో ఈ నేత‌ల‌కు లోకేష్ మార్క్ రిటైర్మెంట్‌… ?

2029 సాధార‌ణ ఎన్నిక‌లు ఏపీలో అధికార టీడీపీలో చాలా మార్పుల‌కు శ్రీకారం చుట్ట‌నున్నాయి. ఈ ఎన్నిక‌లు పూర్తిగా లోకేష్ రాజ‌కీయానికి మార్గ‌నిర్దేశం చేయ‌నున్నాయి. ఇక పార్టీ పూర్తిగా లోకేష్ అండ‌ర్ టేకింగ్‌లోకి వెళ్లిపోనుంది. ఈ క్ర‌మంలోనే పార్టీలో చాలా మంది సీనియ‌ర్ నేత‌ల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌దంటున్నారు. మ‌రీ ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత‌ల్లో ఈ సారి చాలా మందిని ప‌క్క‌న పెట్టేసి.. వారి రాజ‌కీయ వార‌సుల‌నో లేదా కొత్త త‌రం నేత‌ల‌నో తెర‌మీద‌కు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు పార్టీలో ఇప్ప‌టికే అంత‌ర్గ‌తంగా మొద‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలోనే ఎవ్వ‌రూ ఊహించ‌ని నేత‌ల‌ను కూడా ఈ సారి ఎలాంటి మొహ‌మాటం లేకుండా ప‌క్క‌న పెట్టేస్తారంటున్నారు. ఈ లిస్టులో ఊహించ‌ని పేర్లు కూడా ఉండ‌నున్నాయి. ఆ పేర్లు ఎవ‌రివి… ఆ లెక్క‌లు ఏంటో పూర్తి విశ్లేష‌ణ కోసం ఈ క్రింది వీడియో క్లిక్ చేసి వినండి.