ది రాజాసాబ్ : ప్రభాసే ఇద్దరు హీరోయిన్లు కావాలన్నారు.. మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కొద్ది గంటల క్రితం రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్‌ టీజర్ రిలీజ్‌ అయిన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటుంది. మాస్ బ్యాంగ్ అంటూ ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టీజర్‌ని ఒక భారీ ఈవెంట్‌ను ఏర్పాటు చేసి మరి టీం రిలీజ్ చేశారు. దేశ న‌లుమూలాల నుంచి ఎంతోమంది జర్నలిస్టులు ఈ ఈవెంట్లో సందడి చేశారు.

దీని కోసం.. హైదరాబాద్‌లోని పార్క్ హయాత్ హోటల్లో దాదాపు వారం రోజుల క్రితమే 70కి పైగా రూమ్స్ ను బుక్ చేసిన టీం.. టీజర్ లాంచ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. సినిమాలో హీరోయిన్గా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ గ్లామ‌ర్ డోస్‌తో హైలెట్ చేసిన సంగతి తెలిసిందే. టీజర్ లో ఇద్దరు హీరోయిన్లు గ్లామర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. కాగా.. ఈ ఇద్దరు హీరోయిన్స్‌ను సినిమాలో ఎలా సెలెక్ట్ చేసుకున్నాడ‌నే అనే విషయాన్ని డైరెక్టర్ మారుతి వివరించాడు.

ప్రభాస్ గారు స్వయంగా.. డార్లింగ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టవా.. ఎలాగు మన రియల్ లైఫ్ లో హీరోయిన్ లేదుగా అని అడిగారని.. కల్కి సినిమాలో హీరోయిన్ ఉన్న ఎలాంటి సన్నివేశాలు ఉండవు.. సలార్ సినిమా చూస్తే అందులో హీరోయిన్ ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు. ఆదిపురుష్‌.. సీతని నాకు దూరం చేసేసారు. బొత్తిగా ఇటీవల కాలంలో సినిమాల్లో హీరోయిన్స్ కి స్కోప్ లేకుండా పోయింది. కనీసం ఇద్దరు హీరోయిన్స్‌ని ఈ సినిమాలో అయినా పెట్టు అని అడిగారని.. వెంటనే నేను ప్రభాస్ గారి వైపు చూసి మీ రేంజ్‌కు ఇద్దరు ఏంటి సార్.. ముగ్గురిని పెడతా అని చెప్పా అంటూ మారుతి వివరించాడు.