టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సాలిడ్ సక్సెస్ తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజగా అల్లు అర్జున్.. బాలీవుడ్ స్టార్ మిస్టర్ పర్ఫెక్ట్ హీరో అమీర్ ఖాన్‌ను కలుసుకున్నాడు. దానికి కారణం తెలియదు కానీ.. ఆ ఫొటోస్ నెటింట వైరల్‌గా మారాయి. అయితే.. వీళ్ళిద్దరూ కలవడానికి కారణం అట్లీ డైరెక్షన్‌లో బన్నీ నటించిన సినిమా అంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ వైరల్ గా మారింది. అయితే.. వాస్తవానికి అమీర్ కోసం అనుకున్న పాత్ర ఆయన చేయవలసింది కాదట. ఆయనకంటే ముందు మరో బాలీవుడ్ స్టార్ హీరోను భావించాడట అట్లీ.
అయితే.. అల్లు అర్జున్ ఆ స్టార్ హీరో తన సినిమాలో వద్దంటూ అట్లీని స్పెషల్ రిక్వెస్ట్ చేశాడని టాక్ నెటింట వైరల్ గా మారుతుంది. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు అక్షయ్ కుమార్. అట్లీ.. అక్షయ్ కుమార్‌తోనే ఫైనలైజ్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. కానీ.. బన్నీ మాత్రం దానికి నో చెప్పేసాడు. అక్షయ్ కుమార్ కాకుండా ఈ సినిమాలో అమీర్ ఖాన్ ను తీసుకుంటే చాలా చాలా బాగుంటుందంటూ.. సినిమాపై కూడా భారీ హైప్ వస్తుందని సజెస్ట్ చేయడమే కాదు.. పట్టుబట్టి అక్షయ్ ప్లేస్‌లో అమీర్ ఖాన్‌ను రీప్లేస్ చేయించాడంటూ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది.
అయితే.. బన్నీ ఎందుకు అసలు అక్షయ్ కుమార్‌ను వద్దని అంతలా పట్టుబట్టి అమీర్ ఖాన్‌ను సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే సందేహాలు అందరిలోనూ మొదలై ఉంటాయి. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలోనూ చర్చినియాంశంగా మారింది. బన్నీని.. అక్షయ్ కుమార్ ఫ్యాన్స్ తెగ తిట్టిపోస్తున్నారు. అసలు ఎందుకు బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు విమర్శలను ఎదుర్కొంటున్న వారిని ఈ నిర్ణయంతో బాలీవుడ్‌లోనూ విమర్శలకు గురవుతున్నాడు. అయితే ఈ సినిమాతో బన్నీ ఎలాగైనా పుష్ప 2ను మించిన సక్సెస్ అందుకోవాలని కసితో ప్రయత్నిస్తున్నాడని మాత్రం క్లారిటీ వస్తుంది.