ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నేచురల్ స్టార్ గా తిరుగులేని బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు నాని. ఓ పక్క నటుడిగా రాణిస్తూనే.. మరో పక్క ప్రొడ్యూసర్ గాను సత్తా చాటుతున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా నాని హీరోగా నటిస్తూ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన మూవీ హిట్ 3. ఇక ఈ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ అందుకుందో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ రీచ్ అయిన ఈ సినిమా.. ప్రొడ్యూసర్లకు లాభాల వర్షం కురిపిస్తుంది. కాగా.. ఇలాంటి క్రమంలో నానికి సంబంధించిన షాకింగ్ న్యూస్ నెటింట వైరల్‌గా మారుతుంది. నాని తన పేరు మార్చుకోబోతున్నాడని.. టాక్ గట్టిగా వినిపిస్తుంది.
వాటిలో వాస్తవం ఎంత.. అసలు నాని ఇంత సడన్‌గా పేరు మార్చుకోవడానికి కారణాలేంటి ఒకసారి తెలుసుకుందాం. నాని అసలు పేరు ఇప్పటికీ చాలామందికి తెలియదు. నాని అసలు పేరు ఘంటా నవీన్ బాబు కాగా.. అంతా నాని అనే పిలుస్తారు. కారణం.. నాని మొదటి నుంచి ఇదే పేరుతో పాపులర్ అవుతూ వచ్చాడు. ఇక ఇప్పుడిప్పుడే స్టార్ ఇమేజ్ మరింతగా పెరుగుతున్న క్రమంలో.. ఆన్ స్క్రీన్‌పై నాని పేరులో వెయిట్ సరిపోదని.. మంచి స్క్రీన్ నేమ్ కోసం ప్లాన్ చేస్తున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది.
అయితే.. ఈ విషయంలో వాస్తవం ఎంతో తెలియదు కానీ.. ఈ విషయంలో అసలు నిజం లేదని.. నాని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అసలు ఆ అవకాశం లేదంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కారణం.. నాని ఇప్పటివరకు అదే పేరుతో సక్సెస్‌లు అందుకని విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. యూత్ లో, లేడీస్ లో క్రేజీ పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇంతటి ఇమేజ్ తెచ్చిపెట్టిన ఆ పేరును ఆయన ఎందుకు వదిలేస్తాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు. నాచురల్ స్టార్‌కు నాని పేరు అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని.. ఆయన పేరు మార్చకుండా ఉంటే బాగుండు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.