చిరు, బాలయ్య ట‌చ్ చేయలేకపోయినా వెంకీ రేర్ రికార్డ్స్.. ఎప్పటికీ ఆయనకే సొంతం

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ చివరిగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు వరకు ఫ్లాప్‌లు ఎదుర్కొన్న‌ వెంకీ మామ.. ఒక్కసారిగా ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాదు.. ఏకంగా తన కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టి సంచలనం సృష్టించాడు. ఈ సినిమాకు రూ.230 కోట్ల క‌లెక్ష‌న్‌లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పటికే సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న వారందరిలో ఈరోజు కలెక్షన్లు సాధించిన హీరోగా వెంకి కొత్త రికార్డును క్రియేట్ చేశాడు. అయితే.. ఇదే కాకుండా వెంకటేష్ పేరుతో మరో రెండు రేర్ రికార్డులు ఉన్నాయి.

Sankranthiki Vasthunnam: Venkatesh does THIS special act for his family drama

టాలీవుడ్‌లో ఫస్ట్ రూ.10 కోట్ల వసూలు కొల్లగొట్టిన సినిమా కూడా వెంకీ మామదే కావడం విశేషం. 1992 జనవరిలో వచ్చిన చంటి సినిమాతో.. టాలీవుడ్ లో రూ. 10 కోట్లు సాధించిన తొలి సినిమాగా రికార్డ్ సృష్టించాడు. ఈ సినిమా ఏకంగా రూ. 18 కోట్లు కొలగొట్టింది. ఇక ఈ రికార్డును అదే ఏడాది చిరంజీవి ఘరానా మొగుడు సినిమాతో బ్రేక్ చేశాడు. ఏప్రిల్ లో వచ్చిన ఈ సినిమా రూ.10 కోట్ల షేర్ వ‌సూళ్లు సాధించింది. అయితే.. తొలి రూ.10 కోట్ల సినిమాగా వెంకి రికార్డులు మాత్రం చిరు ట‌చ్‌ చేయలేకపోయారు. తర్వాత 2001లో రిలీజ్ అయిన కలిసుందాం రా సినిమాతో మరోసారి రికార్డును క్రియేట్ చేశాడు వెంకి. టాలీవుడ్ లో రూ.25 కోట్ల కలెక్షన్ సాధించిన తెలుగు హీరోగా సత్తా చాటుకున్నారు.

Chanti Telugu Full Length Movie - Venkatesh Movies

ఈ సినిమా రూ.26 కోట్ల వ‌సూళ్ల‌తో ఆల్ టైం ఇండస్ట్రియల్ హిట్గా నిలిచింది. అప్పటివరకు చిరంజీవి, బాలయ్య సినిమాలు కూడా ఈరోజు కలెక్షన్లు సాధించకపోవడం విశేషం. ఆ తర్వాత ఈ స్టార్ హీరోల సినిమాలు కూడా ఈ రేంజ్ కలెక్షన్లను కలగొట్టాయి. ఇప్పుడు మరోసారి సీనియర్ హీరోలలో పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అవుతున్న క్ర‌మంలోనూ అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం నిలిచింది. ఏకంగా రూ.260 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. కేవలం ప్రాంతీయ భాషలో రిలీజై.. ఇంతటి రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టడం అంటే అది సాధారణ విషయం కాదు. అలా.. ఇప్పటివరకు చిరంజీవి, బాలకృష్ణ సైతం వెంకటేష్ ఈ రేర్ రికార్డును టచ్ చేయలేకపోయారు.

Kalisundam Raa (2000) - IMDb