బాలకృష్ణ పెద్ద సైకో.. రూమ్‌కి తీసుకెళ్లి అలా చేస్తాడు.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!

సినీ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని స‌క్స‌స్‌లు అందుకుంటు దూసుకుపోతున్న వారిలో నందమూరి బాలయ్య ఒకరు. సీనియర్ ఎన్టీఆర్ నటవారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య.. ఎన్నో అద్భుతమైన సినిమాలతో బ్లాక్ బ‌స్టర్లు అందుకున్నాడు. ఇప్పటికీ బాలయ్య.. యంగ్‌ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సక్సెస్‌లతో రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. బాలయ్య పద్మభూషణ్‌ అవార్డును సైతం దక్కించుకున్నాడు. కాగా.. ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూనే మరోవైపు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బాలయ్యను అభిమానించే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది.

ఇలాంటి స్టార్ నటుడిపై తాజాగా.. డైరెక్టర్ గీత కృష్ణ సంచలన కామెంట్స్‌ చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను కే.విశ్వనాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న టైంలో బాలకృష్ణ జననీ జన్మభూమి సినిమాలో నటించాడని.. ఆ టైంలో బాలకృష్ణ నాతో చాలా మంచిగా ఉండేవారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ.. ఇప్పుడు తనలో చాలా మార్పులే వచ్చేసాయని.. ప్రస్తుతం బాలయ్య మెంటాలిటీ చేంజ్ అయింది అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన ఓ సైకో లాగా ప్రవర్తిస్తున్నారని.. షూటింగ్ లొకేషన్‌లో ఎవరైనా పొరపాటున చూసి నవ్వినా.. వారిని తన రూమ్‌కు తీసుకెళ్లి కొడుతున్నారని.. గీత కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

Senior Director Geetha Krishna shocking comments on nandamuri Balakrishna  goes viral pa| Balakrishna: బాలయ్య పెద్ద సైకో..!.. చీకటి గదిలోకి తీసుకెళ్లి  అలాంటి పనులు.. డైరెక్టర్ షాకింగ్ ...

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెటింట‌ దుమారం రేపుతున్నాయి. తమ అభిమాన నటుడు గురించి గీత కృష్ణ చేసిన వ్యాఖ్యలను నందమూరి అభిమానులు అసలు సహించలేకపోతున్నారు. గీత కృష్ణ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేసి.. నీకు నచ్చినట్లుగా, నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే సహించమంటూ మండిపడుతున్నారు. ఇక బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే చివరగా డాకు మహారాజ్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఆయన.. ప్రస్తుతం అఖండ 2 షూట్ లో బిజీగా గడుపుతున్నాడు.