పెద్ది స్టైల్‌లో సిక్స్ కొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్ ప్లేయర్.. చరణ్ రియాక్షన్ ఇదే.. !

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకున్న చరణ్.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇక‌ చరణ్ చివరిగా.. శంకర్ డైరెక్షన్లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ సినిమా.. ఆడియన్స్ ఊహించిన రేంజ్ లో ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వ‌ద్ద డీలా ప‌డిపోయింది. అయితే చరణ్ తన నెక్స్ట్‌ సినిమాతో ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

ఇక చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా డైరెక్షన్‌లో పెద్ది సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ రిలీజ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమాలో చరణ్ మాస్ లుక్ జ‌నాని ఆక‌ట్టుకుంది. ఇదిలా ఉంటే.. ఈ టైటిల్ టీజ‌ర్‌లో చరణ్ క్రికెట్ ఆడే సీన్ ఆడియన్స్‌ను క‌ట్టిప‌డేసింది. చరణ్ సిగ్నేచర్ షార్ట్‌గా తెగ వైరల్ అయింది. ఇప్పుడు ఇదే క్రికెట్ షాట్ రీ క్రియేట్ చేశాడు ఢిల్లీ క్యాపిటల్స్ యంగ్‌ క్రికెటర్. ప్రస్తుతం ఐపిఎల్ సీజన్ నడుస్తున్న క్రమంలో.. ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా క్రికెట్ ను వీక్షిస్తున్నారు.

Ram Charan Reacts To Delhi Capitals Recreating His Peddi First Shot | Times  Now

ఇలాంటి క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్ పెద్ది క్రికెట్ షార్ట్ రీ క్రియేట్ చేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. నిన్న ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ డిసి మ్యాచ్ ఎంతో రసవతారంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఢిల్లీ ఈ మ్యాచ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసుకుంది. ఈ వీడియోలో సమీర్ రజ్వి.. రామ్ చరణ్ స్టైల్ లో సిక్స్ కొడుతూ కనిపించాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజ‌న్స్ రకరకాలుగా స్పందిస్తుండగా.. చరణ్ కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు. థాంక్స్ చెప్తూ ఈ వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తో పాటు.. చరణ్ రియాక్షన్ తెగ వైరల్ గా మారుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)