ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ స్టార్ హీరో.. ఒకప్పుడు ఇండస్ట్రీలోనే తిరుగులేని ఇమేజ్‌తో. వరుస సక్సెస్‌లతో గ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే.. హీరోలకు హిట్స్, ఫ్లా ప్స్ అనేవి సర్వసాధారణం. ఫ్లాప్స్ వచ్చినప్పుడు డీల పడిపోవడం.. హిట్స్ వచ్చినప్పుడు పొంగిపోవడం హీరోల జీవితాల్లో కామన్ గానే జరుగుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఈ హీరో మాత్రం.. దాదాపు 13 ఏళ్లగా ఒక్క హిట్ కూడా లేకుండా వరుస ప్లాప్ లతో కొనసాగుతున్నాడు. అయినా కృంగిపోకుండా స్ట్రాంగ్‌గా రాణిస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో చెప్పలేదు కదా.. తన కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తమిళ్లో చాలామంది స్టార్ హీరోలు ఉన్న అజిత్, విజయ్ టాప్ పొజిషన్లో రాణిస్తున్న వీరిద్దరి కంటే.. సూర్యకే ఎక్కువ పాపులారిటీ ఉంది.
విలక్షణ నటుడుగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సూర్య.. ఎలాంటి క్యారెక్టర్ నైనా సులువుగా నటించేస్తాడు. పాత్రలో లీనమైపోతాడనే పేరు ఉంది. ఇక 2001లో సూర్య నుంచి తెరకెక్కిన నంద సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి భారీ పాపులారిటి తెచ్చిపెట్టింది. తర్వాత.. ఆయన వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. గజినీ, కాక్కా కాక్కా, సింగం, 7uam మూవీలతో స్టార్ హీరోగా మరో మెట్టు ఎక్కించాయి. ఈ రేంజ్ స్టార్ట్ ఇమేజ్ను సంపాదించుకున్న సూర్య.. ప్రస్తుతం విజయాలకు ఆమడ దూరంలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనకు హిట్ పడి 13ఏళ్ళు అయ్యింది. 2013లో వచ్చిన సింగం (యముడు 2) సినిమా తర్వాత సూర్యకు ఒక్క హిట్ కూడా పడలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన కొంగువ కూడా అభిమానులను మెప్పించలేకపోయింది.
అయితే వెండితెరపై ఫెయిల్ అయిన సూర్య ఓటిటిలో మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంటున్నాడు. ఆకాశమే హద్దురా, జై భీమ్ లాంటి సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు. అయితే వెండితెరపై మాత్రం తన రేంజ్‌కు తగ్గ రిజల్ట్ ను అందుకోలేకపోతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా అయిన నటించిన రెట్రో సినిమా కూడా అనుకున్న సక్సెస్ అందుకోలేకపోయింది. అలా.. ఇప్పటికే 13 ఏళ్లుగా సూర్య హిట్ లేక సతమతమవుతున్నాడు. ఈ విషయంలో సూర్య అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్న.. మరోపక్క సూర్య తన నెక్స్ట్ సినిమాలతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడం ఖాయమని.. మరోసారి పూర్వ వైభవం వచ్చేస్తుందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.