ట్రలాలా అందుకే పెట్టా.. పేరు వెనుక సీక్రెట్ రిలీజ్ చేసిన సమంత..!

స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగులేని ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సమంత.. ట్రలాలా మేకింగ్ పిక్చర్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను స్థాపించి.. తొలి ప్రయత్నం గా శుభం సినిమాను రూపొందించిన సంగతి తెలిసిందే. కొత్త నటీనటులను పరిచయం చేస్తూ.. సమంత నిర్మించిన ఈ సినిమాల్లో సమంత కూడా ఓ కీలక పాత్రలో కనిపించనుంది. అయితే ట్రలాలా నిర్మాణ సంస్థ పేరు రొటీన్‌కు భిన్నంగా ఉండాలని పెట్టానని.. దాని అర్థం ఇదేనంటూ.. ఇంట్రెస్టింగ్ విషయాలను రివిల్ చేసింది. తను చిన్నప్పుడు బ్రౌన్ గర్ల్ ఆన్ రెయిన్ ట్ర‌లాలా అనే పోయెమ్ ఎక్కువగా పాడుకునేద‌ట‌.

Subham 2025 | Subham Telugu Movie: Release Date, Cast, Story, Ott, Review,  Trailer, Photos, Videos, Box Office Collection – Filmibeat

అలా సడన్‌గా ట్రలాలా పేరు స్ట్రైక్ కావడంతో ఈ పేరు సంస్థకు పెడితే క్రేజీగా ఉంటుందని పెట్టానని.. అంతకుమించి వేరే లాజిక్ ఏం లేదంటూ చెప్పుకొచ్చింది. తన సంస్థతో కొత్త వాళ్ళని ప్రోత్సహించాలని ఉద్దేశంతోనే ఈ బ్యానర్‌ను స్థాపించాన‌ని.. ఎంతోమంది ప్రతిభవంతులు అవకాశాలు లేక పరిశ్రమల్లో అడుగుపెట్టలేకపోతున్నారు.. అలాంటి వాళ్లకు ట్ర‌లాలా మంచి ఫ్లాట్‌ఫాం కావాలని భావిస్తున్నా.. టాలెంటెడ్ నటులను పైకి తీసుకురావాలంటూ చెప్పుకొచ్చింది. తాను కూడా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చానని వివరించింది. సీనియర్లే కావాలనుకుంటే గౌతం నన్ను కాకుండా వారిని తీసుకునేవార‌ని చెప్పుకొచ్చింది.

Samantha Ruth Prabhu launches production house Tralala Moving Pictures -  The Earth News Network

కానీ.. నాకు ఆయన అవకాశం ఇచ్చాడు కనుక.. నేను ఈ స్టేజ్‌లో ఉన్నా.. ఈ సినిమాలో నటీనటుల్ని చూస్తే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చింది. టాలెంటెడ్ వ్యక్తులను సరైన అవకాశాలు ఇస్తే అద్భుతాలు సృష్టిస్తారని నమ్మకం నాకుంది అంటూ వివరించింది. సాధారణ పేర్ల కంటే ట్రలాలా పేరు చాలా డిఫరెంట్ గా ఉండడంతోనే పెట్టానని చెప్పుకొచ్చింది. శుభం క‌థ‌ అంతా సీరియల్ తో ముడిపడి ఉంటుంది.. సీరియల్ కి శుభం కార్డు ఎప్పుడు పడుతుందా అని అంతా ఎదురు చూస్తూ ఉంటారు.. ఇంతకీ సినిమా కథకి ఆ సీరియల్‌కు సంబంధం ఏంటి అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాలంటూ వివరించింది. ప్రస్తుతం సమంత కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.