శ‌భాష్ నాని… టాలీవుడ్ ఈ విష‌యంలో నిన్ను చూసి నేర్చుకోవాలి… !

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న చాలామంది ఒక్క విషయంలో మాత్రం నానిని చూసి నేర్చుకోవాలని.. ఆ విషయంలో నాని గ్రేట్ హీరో అంటూ.. శభాష్ నాని అంటూ ర‌క‌ర‌కాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ నానిని అంతలా ప్రశంసించడానికి కారణమేంటి.. ఏం చేశాడో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా ఎంత విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారంటే.. తమది కాకపోతే మాత్రం డబ్బులు మంచినీళ్లలా ఖర్చు చేసేస్తూ.. ఎడాపెడా వాడేస్తూ ఉంటారు. అదే వారిదైతే మాత్రం బంగారంలా దాచుకొని ఆచితూచి అడుగులు వేస్తారు.

$75K and Counting: Nani's HIT 3 heads for pre-sales history in the USA

అదే ఇతర ప్రొడక్షన్ హౌస్లలో వస్తున్న సినిమా అయితే పబ్లిసిటీ ఇంకా ఇంకా అదరగొట్టాలని డబ్బును ఊరికే ఖర్చు చేస్తూ ఉంటారు. అదే సొంత సినిమా అయితే మాత్రం క్వాలిటీ అంతంత మాత్రమే ఉన్నా.. పబ్లిసిటీ నీరసంగా ఉన్నా.. దులిపేసుకుని వెళ్ళిపోతారు. అయితే టాలీవుడ్‌లో నాచురల్ స్టార్ నాని మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమైన‌ హీరో.. నిర్మాతగాను నాని అలాగే వ్యవహరిస్తారు. సినిమాల ప్రచారాన్ని కూడా బడ్జెట్ పెట్టిన రేంజ్‌లోనే చేస్తూ ఉంటాడు. ఎక్కడ కక్కుర్తి పడకుండా.. రాజీ పడకుండా.. నిర్మాణ విలువలతో పనిచేస్తాడు. ఎంత ఖర్చు కావాలో అంతగానే ఖర్చు పెడతాడు.

Nani Fans Army ™ (@nanifansarmy) • Instagram photos and videos

అది పబ్లిసిటీ విషయంలో అయినా.. ప్రొడక్షన్ విషయంలో అయినా. ప్రస్తుతం సాగుతున్న పబ్లిసిటీ నే దానికి బెస్ట్ ఉదాహరణ. ఎక్కడో ఓ చోటా.. సింపుల్గా ఇంటర్వ్యూ ఇచ్చి ప్రమోషన్స్‌ను ముగించవచ్చు. కానీ.. నాని అలా కాదు.. ఫ్లోర్ మొత్తం తీసుకొని ఐదు, ఆరు సెట్లు డిజైన్ చేయించి మరీ.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇన్ఫ్లుయెన్సర్లను సెలెక్టివ్గా ఎంచుకొని.. వారికి మంచి ఆతిథ్యం ఇచ్చి వారితో ఇంటర్వ్యూలు చేయించుకుంటున్నాడు. ఇదంతా ఖర్చుతో కూడిన పని అయినా సరే.. ఎక్కడ తగ్గకుండా సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఇతర హీరోలా సొంత సినిమాలకు, ఇతర బ్యానర్ల సినిమాలకు పబ్లిసిటీ అలాగే.. నాని సొంత బ్యానర్స్ సొంత సినిమాల పబ్లిసిటీకి తేడా గమనిస్తే నాని గొప్పతనం అర్థమవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.