మెగాస్టార్ సినిమాకు విలన్‌గా ఆ కుర్ర హీరో.. అనిల్ ఏం ప్లాన్ సామీ..!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైర్ తెర‌కెక్కనున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఓ కామిక్‌ పాత్రలో చిరంజీవి ఆడియన్స్‌ను కడుపుబ్బ నవ్వించనున్నాడు. ఇక స్టోరీకి చిరు ఎంతలా కనెక్ట్ అయ్యారో గతంలో ఆయన చేసిన కామెంట్స్‌తోనే అర్థమయింది. అనిల్ నాకు కథ చెబుతున్న టైంలో నవ్వు ఆపుకోలేకపోయాను.. చాలా కాలం తర్వాత కోదండరామిరెడ్డి లాంటి డైరెక్టర్ తో పని చేస్తున్న ఫీల్ వస్తుందని.. అలా అని సినిమాలో యాక్షన్ కూడా మిస్ కాదు అంటూ చిరంజీవి చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి సినిమా అంటేనే నవరసాలు ఉంటాయి. అందులో యాక్షన్ కూడా ప్రధాన జానర్. ఈ క్రమంలోని సినిమాలో విలన్ గా ఎవరు కనిపించబోతున్నర‌నే టాక్‌ వైరల్‌గా మారుతుంది.

Chiranjeevi wishes Kartikeya's Raja Vikramarka Team

మెగాస్టార్ సినిమాకు విలన్ గా యంగ్ హీరో కార్తికేయ గుమ్మడికొండ పేరు వైరల్ గా మారుతుంది. చిరును ఢీకొట్టే పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడని సమాచారం. ఇందులో విలన్ పాత్ర కూడా కామిక్ గానే ఉండనుంద‌ట‌. అయితే కార్తికేయ విషయంలో క్లియర్ క్లారిటీ లేకపోయినా.. సన్నిహిత వర్గాల నుంచి ఈ వార్త వైరల్ గా మారుతుంది. ఇది నిజమైతే కార్తికేయకు ఇండస్ట్రీలో తిరిగే ఉండదు. చిరంజీవికి వీరాభిమానిగా ఉన్న కార్తికేయ.. డ్రీమ్ కూడా ఫుల్ ఫీల్ అయినట్లే. అసలు చిరును చూసే తాను హీరో అవ్వాలనుకున్నానని.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాలంటే ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టానని.. కార్తికేయ గతంలోనే ఎన్నోసార్లు వెల్లడించారు.

Chiranjeevi's next with Anil Ravipudi launched on Ugadi | Telugu Movie News  - The Times of India

ఇక తను హీరో మెటీరియల్ కావడంతో ఆర్ ఎక్స్ 100 సినిమాల అవకాశాన్ని దక్కించుకున్న కార్తికేయ.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అంతేకాదు.. నాని గ్యాంగ్ స్టార్ సినిమాలోను, తమిళ్‌లో అజిత్ హీరోగా నటించిన వలిమై సినిమాలోను కార్తికేయ విలన్ పాత్రలో మెప్పించాడు. ఇలా ఇప్పటికే మంచి నటుడుగా కార్తికేయ సత్తా చాటుకున్న క్రమంలో.. చిరు సినిమాలో అనిల్‌కు కూడా అవకాశం ఇచ్చాడని.. చిరంజీవి దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో యంగ్ యాక్టర్స్ ను చిరంజీవి ప్రోత్సహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారడంతో.. అనిల్ ఏం ప్లాన్ చేస్తున్నాడు.. సినిమా ఆడియన్స్ ఏ రేంజ్ లో ఆకట్టుకునుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది.