టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని నటుడు గానే కాదు.. ప్రొడ్యూసర్ గాను ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న నాని.. ఆడియన్స్ పల్స్ పట్టేసి సినిమాలతో హిట్లు అందుకుంటున్నాడు. నిన్న మొన్నటి వరకు పక్కింటి కుర్రాడులా.. నాచురల్ నటనతో ఆకట్టుకున్న ఈయన.. ప్రస్తుతం మాస్ అవతారం ఎత్తాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆయన నటించిన మూవీ హిెట్ 3. నాని సొంత ప్రొడక్షన్ బ్యానర్లో రూపొందిన ఈ సినిమా మే 1న గ్రాండ్ లెవల్లో రిలీజ్ కానుంది. హిట్ ఫ్రా్చైజ్లో భాగంగా.. హిట్ ది థర్డ్ కేస్.. రూపొందింది. ఇక ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ అంత ఆడియన్స్‌లో సినిమాపై మంచి అంచనాలు నెలకొల్పాయి.
అర్జున్ సర్కార్ ఐపీఎస్ ఆఫీసర్ రోల్లో నాని నటించిన ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. వీరిద్దరి కాంబోలో ఇది మూడో సినిమా కావడం.. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ రిత్యా.. వరల్డ్ వైడ్‌గా సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ భారీ లెవెల్లో జరిగింది. నైజాంలో రూ.13 కోట్లు, సీడెడ్ లో రూ.5.40 కోట్లు, మిగతా ఆంధ్రప్రదేశ్‌లో రూ.15 కోట్లు.. ఇలా మొత్తంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ కలిపి సినిమా రూ.33.40 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకోగా.. కర్ణాటక, మిగిలిన భారతదేశంలో కలిపి రూ. 5.50 కోట్లు విదేశాల్లో రూ.10 కోట్లు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.48.90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
ఇలా ఇప్పటివరకు నానిగారు కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా హిట్ రికార్డు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ.50 కోట్ల షేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టాల్సిన అవసరం ఉంది. ఈ సినిమాకు ఉన్న హైప్ రిత్య సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. బ్రేక్ ఈవెన్‌ను క్రాస్ చేయడం చాలా సులభం. ఈ క్రమంలోనే హిట్ 3తో నాని తన సక్సెస్ఫుల్ జర్నీ కంటిన్యూ చేస్తాడా.. లేదా.. తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాలి.