లెక్చరర్ ను అవమానించిన చిరు.. తప్పు తెలుసుకుని సాయం.. కట్ చేస్తే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మొదట్లో పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, వీలన్‌గా నటిస్తూనే.. హీరోగా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇక 1983లో చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ సినిమా ఫుల్ ఆఫ్ మాస్ యాక్షన్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఈ క్రమంలోనే తిరుగులేని స్టార్టంలో దక్కించుకున్నాడు. ఈ రేంజ్ మాస్ ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా తన స్టార్‌డంకు భిన్నంగా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ నటించారు. అలాంటి వాటిలో జంధ్యాల డైరెక్షన్లో తెర‌కెక్కిన చంటబ్బాయి సినిమా కూడా ఒకటి. ఈ సినిమాలో మెగాస్టార్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు.

ఇక సినిమా షూటింగ్ టైంలో మీరాకిల్ జరిగింది. అదే హాస్య బ్రహ్మ.. బ్రహ్మానందం ఈ సినిమాతో నటుడుగా ఎంట్రీ ఇవ్వడం. ప్రస్తుతం బ్రహ్మానందం హాస్య బ్ర‌హ్మ‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కమెడియన్ గా ఎదిగారు. అత్యధిక సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డులు కూడా సొంతం చేసుకున్నాడు. బ్రహ్మీ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకున్నందుకు దీనిని పురస్కరించుకుంటూ టాలీవుడ్ సినీ పరిశ్రమ సైతం బ్రహ్మానందాన్ని సన్మానించింది. ఇక ఈ కార్యక్రమంలోనే బ్రహ్మానందం, చిరంజీవి ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. మొదటినుంచి చిరు, బ్రహ్మీ చాలా క్లోజ్ అన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బ్రహ్మానందం మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఎన్నో విషయాలను పంచుకున్నాడు.

Brahmanandam (Comedian) Age, Wife, Family, Biography & More » StarsUnfolded

జంధ్యాలకు.. బ్రహ్మానందం తెలిసిన వ్యక్తి. అందుకే చంటబ్బాయి సినిమాలో ఆయన అవకాశం ఇచ్చారు. అయితే.. ఆ సినిమాలో బ్రహ్మానందం పోషించింది చిన్న పాత్ర మాత్రమే. ఆ తర్వాత బ్రహ్మానందం టాలీవుడ్ లో ఎంతలా ఎదిగారో చిరంజీవి వివరించారు. బ్రహ్మానందం మాట్లాడుతుండగా వెంటపడి మైక్ లాక్కుని మరి ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఈవెంట్లో చిరు మాట్లాడుతూ చంటబ్బాయి షూట్ టైం లో అసలు బ్రహ్మానందం ఎవరో కూడా నాకు తెలియదు. నేను సెట్స్‌లో డ్యాన్స్ చేస్తున్న టైంలో బ్రహ్మానందం ముందుకు వచ్చి నిలబడి విచిత్రంగా ఎక్స్ప్రెషన్స్ పెడుతూ చూస్తున్నాడు. అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నాకు చాలా డిస్టర్బింగ్ గా అనిపించింది అంటూ చిరంజీవి వివరించాడు.

Megastar Chiranjeevi Garu Speech At BrahmaAnandam Pre Release Event | TFPC  - YouTube

ఏ బాబు వెనక్కి వెళ్ళు అని కోపంగా చెప్పానని.. షూటింగ్ పూర్తయ్యాక జంధ్యాల గారు.. బ్రహ్మిని నాకు పరిచయం చేసి ఇతను లెక్చరర్ అని చూపించారని.. సారీ సార్ మీరు లెక్చరర్ ఆ మీ ఫేస్ చూస్తే అలా అనిపించలేదు.. అందుకే వెనక్కు వెళ్లి నుంచోమని చెప్పేసా అని చిరంజీవి అన్నారట‌. వెంటనే అక్కడ ఉన్న వారంతా పక్కుమని నవ్వేశారు. సారీ మాస్టారు.. ఏమీ అనుకోవద్దు అని చెప్పా. తను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలని ఉద్దేశంతో సాయంత్రం రూమ్ కి రమ్మని పిలిచా. కాస్త ఎక్కువ మాట్లాడితే జరిగిన తప్పు గురించి మర్చిపోవచ్చు.. ఫ్రెండ్స్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో బ్రహ్మిని రూమ్ కి రామన్నా. ఇక అక్కడ బ్రహ్మానందం మిమిక్రీ అద్భుతంగా చేసి చూపించారు. అది చూసిన చిరు ఇతనిలో అంత టాలెంట్ ఉందని ఆశ్చర్యపోయారట. ప్రతిభ ఉన్న వ్యక్తి అత్తిలిలో ఉండిపోకూడదనే ఉద్దేశంతో వెంటనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి నాతో పాటు చెన్నై తీసుకెళ్లాలని.. చిరంజీవి గుర్తుచేసుకున్నాడు. కట్ చేస్తే బ్రహ్మానందం టాలీవుడ్ లోనే తిరుగులేని కమెడియన్ గా ఎదిగి చూపించాడు