సినీ ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుంది అంటే.. దాని రిసల్ట్ ఎలా ఉంటుందో ఎవ్వరు ముందే చెప్పలేరు. ఇంకా విచిత్రము ఏంటంటే.. మొదట్లో ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలే తర్వాత బ్లాక్ బస్టర్లుగా రికార్డులు క్రియేట్ చేసి కలెక్షన్లు పరంగా సత్తా చాటిన సందర్భాలు ఉన్నాయి. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది టోటల్గా ఆడియన్స్ ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి పాజిటివ్ టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు ఉన్నాయి. కాగా ఇప్పుడు.. ఫస్ట్ డే ఫ్లాప్ టాక్‌తో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సినిమాలు ఏవో ఒకసారి చూద్దాం.
జల్సా
పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కి.. భారీ హైప్ నెలకొల్పిన సినిమా జల్సా. 2008లో రిలీజ్ అయిన ఈ సినిమా.. ఫస్ట్ డే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ.. పవన్ కళ్యాణ్ క్రేజ్‌తో ,అలాగే సమ్మర్ సీజన్ కలిసి రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
సరైనోడు:
అల్లు అర్జున్, బోయపాటి కాంబోలో.. 2016 సమ్మర్ కానుకగా రిలీజ్ అయిన సినిమా సరైనోడు. ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. సమ్మర్ సీజన్ కావడంతో.. మాస్ ఆడియన్స్ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఈ క్రమంలోనే సినిమా కలెక్షన్ల పరంగా సత్తా చాటుకుంది.
జనతా గ్యారేజ్:
తారక్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన సినిమా 2016లో రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా.. మెల్లమెల్లగా మిక్స్డ్ టాక్ రావడంతో.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది.
జై సింహ:
బాలకృష్ణ హీరోగా, కే.ఎస్. రవికుమార్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా.. 2018 సంక్రాంతి బరిలో రిలీజై ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర మాత్రం మంచి సక్సెస్ అందుకుంది.
సరిలేరు నీకెవ్వరు:
మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబోలో రూపొంది.. 2020లో రిలీజ్ అయ్యిన ఈ మూవీ నెగిటివ్ టాక్ దక్కించుకుంది. కానీ.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మంచి సక్సెస్ అందుకుంది.
పుష్పా ది రైజ్
అల్లు అర్జున్ హీరోగా.. సుకుమార్ తాంబూలో రూపొంది 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ డే ప్లాప్ టాక్ దక్కించుకుంది. కానీ.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది.
బంగార్రాజు:
నాగార్జున, నాగ చైతన్య కాంబోలో మల్టీ స్టారర్‌గా రూపొందిన ఈ సినిమా.. ఫస్ట్ డే నెగిటీవ్ టాక్ తెచ్చుకున్నా.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టింది.
సర్కారు వారి పాట:
మహేష్ బాబు హీరోగా.. పరశురాం డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా.. 2022 సమ్మర్ కానుకగా రిలీజై.. మొదటిరోజు మిక్స్డ్ టాక్ అందుకుంది. కానీ.. బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.