తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా తన నెక్స్ట్ సినిమా అఫీషియల్ గా ప్రకటించారు. అట్లీ డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కనుందని అనౌన్స్ చేశారు. వీడియో కూడా రిలీజ్ చేశారు టీం. ఈ వీడియోలో బన్నీ, అట్లీ హాలీవుడ్ వెళ్లి అక్కడ మాట్లాడుతున్నట్లు చూపించారు. బన్నీ.. ఫేస్, బాడీ నమూనాలను తీసుకున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. దీంతో హాలీవుడ్ రేంజ్ భారీ గ్రాఫిక్స్ తో ఈ సినిమా తెరకెక్కనుందని టాక్. అయితే ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్, అట్లీ సినిమా బడ్జెట్ ఇండియా కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్. ఇండియాలోనే ఇప్పటివరకు తెరకెక్కిన అత్యధిక బడ్జెట్ సినిమాల్లో రెండవ స్థానంలో నిలవనుందట.
ఏకంగా ఈ సినిమాకు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. ఇందులో.. రూ.175 కోట్లు బన్నీ రెమ్యూనరేషన్. కాగా.. మరో రూ.100 కోట్లు రెమ్యునరేషన్ అట్లీకి ఇవ్వనన్నారని.. మరో రూ.250 కోట్లు కేవలం విఎఫ్‌ఎక్స్‌కు ఖర్చు అవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సినిమాలో గ్రాఫిక్స్ భారీ లెవెల్ లో ఉండనున్నాయట. ఇక ప్రొడక్షన్ కు, మిగిలిన సినిమాకు, వేరే ఆర్టిస్టులకు అన్నింటికీ కలిపి రూ.200 కోట్లు ఇవ్వనున్నట్లు తమిళ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో.. ప్రస్తుతం అట్లీ, బన్నీ సినిమా బడ్జెట్ చూసి నోరెళ్ళబెడుతున్నారు నెటిజన్స్.
మరి ఇంటర్నేషనల్ లెవెల్ లో తెరకెక్కనున్న ఈ సినిమా ఎలా ఉంటుందో వేచి చూడాలి. అయితే ఇప్పటివరకు ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా కల్కి. ఈ సినిమాకు ఏకంగా రూ.600 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ తెరకెక్కించారు. అయితే.. ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి సినిమాకు రూ.1000 కోట్లు బడ్జెట్ పెడుతున్నట్లు సమాచారం. దీంతో ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమా గా మహేష్ – జక్కన్న సినిమా ఉండగా.. రెండో స్థానంలో బన్నీ – అట్లీ సినిమా తెరకెక్కనుంది.