తారక్ – నీల్ రిలీజ్ డేట్ చేంజ్.. వచ్చేది ఎప్పుడంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ మిల్ కాంబోలో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌ రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానునట్లు టీం వెల్లడించారు. ఈ మేరకు నిర్మాణ సంస్థ అఫీషియల్ గా ట్విట్ వేసింది. అయితే ఆ అప్డేట్ ఏమై ఉంటుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ఈ సినిమాను ప్లాన్ చేసిన టీం.. మరో మూడు నెలలు వాయిదా వేసి ఏప్రిల్ లో రిలీజ్ చేయనున్నారట. ఏప్రిల్ 9న ఈ సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. అదే విషయాన్ని మరికొద్ది గంటల్లో అఫీషియల్ గా ప్రకటించాలని టీం భావిస్తున్నారట.

అంటే.. సరిగ్గా 12 నెలల తర్వాత ఈ సినిమా వెండితెరపై సందడి చేస్తుందని సమాచారం. దీనికి డ్రాగన్ టైటిల్లో టీం పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై కూడా అఫీషియల్ ప్రకటన త్వరలోనే రానంది. ఇటీవల తమిళ్ లో ప్రదీప్ రంగ‌నాథ‌న్‌ ఇదే టైటిల్ను యూజ్‌ చేసుకున్నారు. తిరిగి అదే పెట్టుకుంటే.. సినిమాకు ఇబ్బంది కావచ్చు. తెలుగు డబ్బింగ్‌కి రిటన్ ఆఫ్ ది డ్రాగన్ అని పెట్టినా.. జనం మాత్రం ఇది కోలీవుడ్ సినిమాగానే గుర్తు పెట్టుకున్నారు. ఇలాంటి క్రమంలోనే తారక్ – నీల్ సినిమాకు.. ఏ టైటిల్ పెడతారో వేచి చూడాలి. ఇక ఏప్రిల్ 9 అంటే చాలా మంచి టైం. వేసవి సీజన్. అలాగే వరుస సెలవులు కలిసివస్తాయి.

NTR @jrntr and Prashanth Neel get the title as #Dragon #NTRNeel . . . . . .  #GlobalStarNTR #ManofMassesNTR #jrntr#ntr#jrntrcm#cmntr #nkr#ntrgoesglobal  #youngtigerntr#ntrfans #tarak#ramarao#tiger #tollywood#cinema#movies  #Devara#War2#NTR31 ...

గతంలో కేజీఎఫ్ 2 కూడా ఇదే నెలలో రిలీజై ఆల్ ఇండియా లెవెల్ లోనే భారీ కలెక్షన్లను కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ఈ రిలీజ్ డేట్ అయితే నిజంగానే బాగుంటుందని అందరిలోనూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కానీ.. పెద్ద సినిమాలు కచ్చితంగా మొదటి అనౌన్స్ చేసిన డేట్కు ఫిక్సై అయ్యి అదే రోజున వస్తాయని గ్యారెంటీ ఉండదు. ముఖ్యంగా.. టాలీవుడ్ లో ఇది చాలా కామన్ అయిపోయింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9న అయినా తారక్ – నీల్‌ సినిమా 100% వస్తుందా అంటే.. నిర్మాతలు సైతం చెప్పలేని పరిస్థితి. ప్లానింగ్ అయితే దానికి తగ్గట్లుగానే జరుగుతుందని.. ఇది పూర్తిచేసి దేవర 2 సాట్స్ పైకి తీసుకురావాలని ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నాడట.