విజయశాంతి, కళ్యాణ్ రామ్.. తల్లీ, కొడుకులుగా నటించిన తాజా మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ప్రదీప్ చిలకలూరి డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా నుంచి.. తాజాగా టీజర్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయి ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఏప్రిల్ 18న రిలీజ్ కానున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ అందింది. ఇక 2 గంటల 24 నిమిషాలు నడివితో ఈ సినిమా తెరపైకి రానుందట. సినిమా సెన్సార్ రిపోర్టుల ప్రకారం.. ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ఫ్యాక్ట్ ఎమోషనల్ ఎంటర్టైనర్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకొనుందట.
అశోక్ క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ బై అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బొలుసు ప్రొడ్యూసర్లుగా వ్యవహరించిన ఈ సినిమా.. సెన్సార్ టాక్ ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇక సినిమాలో కళ్యాణ్ రామ్, వైజయంతిల నటన ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుందని.. వైజయంతి తన ఐపీఎస్ ఆఫీసర్ రోల్లో బలమైన తల్లి పార్తలో జీవించేసిందని.. కళ్యాణ్ రామ్‌తో కలిసి నటించిన ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతాయంటూ తెలుస్తుంది. తల్లి, కొడుకు మధ్య సంఘర్షణ కథను ప్రధాన ఆధారంగా విజయశాంతి న్యాయం కోసం పోరాడుతున్న మహిళగా.. కళ్యాణ్ రామ్ తన సొంత మార్గంలో నేరస్తుడిగా పోరాడుతున్న వ్యక్తిగా సినిమాను ఎంతో ఇంట్రెస్టింగ్గా మలిచారట. ఈ సినిమా తల్లి, కొడుకుల హార్ట్ టచింగ్ ఎమోషనల్ డ్రామా అని తెలుస్తుంది.
ఈ సినిమాలో వీరిద్దరి మధ్య జరిగే ప్రతి సన్నివేశం భావోద్వేగాలు ఆడియన్స్‌ను మెప్పిస్తాయని అంటున్నారు. సినిమా క్లైమాక్స్ పిక్స్ లెవెల్ లో ఉండబోతుందని.. ఊహించని ట్విస్టులతో.. నిండిన ఈ భాగం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుందని టాక్. ఇక ఫ్యామిలీ రిలేషన్స్, త్యాగాలు సినిమాకు సోల్ గా ఉండనున్నాయట. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే అంశాలు ఈ సినిమాల్లో చూపించనున్నట్లు సమాచారం. ఇక కళ్యాణ్ రామ్ యాక్షన్ అవతార్ ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ లో ఉంటుందని చెప్తున్నారు. సినిమాకు మ్యూజిక్ మరింత హైలెట్గా మారిందిని.. యాక్షన్ ఎలివేట్ చేస్తుందని చెప్తున్నారు. శ్రీకాంత్, సాయి మంజరేకర్, సోహైల్ ఖాన్ తమ పాత్ర నడివిమేర ఆడియన్స్‌ను మెప్పించారని అంటున్నారు. ఈ సినిమాతో కళ్యాణ్ రామ్‌కు మారో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఖాతాలో పడుతుందా.. లేదా.. సినిమా ఆడియన్స్ను ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.