RRR కంటే ముందు తారక్ – చరణ్ కాంబోలో మూవీ మిస్ అయ్యిందని తెలుసా.. రిజ‌ల్ట్ ఇదే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి పాపులారిటీతో దూసుకుపోతున్నారు తెలిసిందే. ఇక వీరిద్దరు కాంబోలో దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. కోట్లాదిమంది ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. కలెక్షన్ల పరంగా సంచలనాలు సృష్టించింది. అంతేకాదు ఇండియన్స్ అంతా ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఆస్కార్ అవార్డును సైతం తెచ్చిపెట్టింది.

ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఖ్యాతి మరింతగా పెరిగిపోయింది. ఇక ఈ సినిమాల్లో తారక్, చరణ్ తమ పాత్రలో జీవించేశారు అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. వీరిద్దరు కాంబోలో గతంలోనే ఓ మూవీ మిస్ అయింద‌న సంగ‌తి చాలా మందికి తెలిసి ఉండ‌దు. ప్ర‌స్తుతం ఇదే న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఆర్‌ఆర్ఆర్ కంటే ముందు చరణ్, తారక్ ఓ సినిమాల్లో కనిపించాల్సి ఉందట. కానీ.. సమయానికి బిజీ స్కెడ్యూల్‌ కారణంగా ఎన్టీఆర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.

Yevadu

ఇంతకీ ఆ సినిమా ఏంటో.. దాన్ని రిజ‌ల్ట్ ఎలా వ‌చ్చిందో ఒకసారి చూద్దాం. తార‌క్ – చరణ్ కాంబోలో మిస్ అయిన ఈ సినిమా మరేదో కాదు.. అల్లు అర్జున్ స్పెషల్ రోల్ లో మెరువగా, చరణ్ హీరోగా నటించిన ఎవడు. ఇక ఈ సినిమాకు మొదట అల్లు అర్జున్ రోల్ కోసం ఎన్టీఆర్ను అప్రోచ్ అయ్యాడ‌ట‌ వంశీ పైడిపల్లి. అయితే.. ఆయన అప్పటికి వర్ష షూట్లతో బిజీగా ఉన్న క్రమంలో.. ఈ సినిమాను వదులుకున్నాడు. ఇక ఈ సినిమా 2024 లో రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకోవడమే కాదు.. అప్పట్లో హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన తెలుగు సినిమాగా రికార్డ్ సృష్టించింది.